మెగా హీరో వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటించిన ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 20వ తారీకున సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండకు రీమేక్.అయితే రీమేక్ అనగానే ఉన్నది ఉన్నట్లుగా దించేయడం దర్శకుడు హరీష్ శంకర్‌కు అస్సలు అలవాటు లేదు.
కేవలం స్టోరీ లైన్‌ను తీసుకుని పూర్తిగా మార్చేయడం మనోడి స్టైల్.గతంలో దబాంగ్ చిత్రాన్ని తీసుకుని పూర్తిగా మార్చేసి గబ్బర్‌సింగ్‌గా తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్నాడు.
అది ఎవరైనా కూడా దబాంగ్ రీమేక్ అనుకోరు.
ఇన్సిపిరేషన్ గా తీసుకుని చేశాడేమో అనిపిస్తుంది.ఇప్పుడు వాల్మీకి చిత్రంను కూడా అలాగే చేసి ఉంటాడని అంతా భావిస్తున్నారు.కాని తాజాగా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తాను అంతా అనుకుంటున్నట్లుగా జిగర్తాండ చిత్రంను పూర్తిగా మార్చేసి వాల్మీకిని తెరకెక్కించలేదు అన్నాడు.
జిగర్తాండ చిత్రంలో బాబీ సింహా పోషించిన పాత్రను కొద్దిగా మార్చాం.ఎందుకంటే ఇక్కడ వరుణ్ తేజ్ హీరో మరియు కాస్త ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చాం.అలాగే కథనం విషయంలో తెలుగు నేటివిటీ టచ్ ఇచ్చాం.
ఆ మార్పులను కాకుండా మరేం మార్పులు తాము చేయలేదని హరీష్ శంకర్ క్లారిటీగా చెప్పేశాడు.గబ్బర్‌సింగ్ స్థాయి మార్పులు అయితే ఇందులో చేయలేదని చెప్పాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్రను కూడా అదనంగా హరీష్ శంకర్ చేర్చాడు.
ట్రైలర్ మరియు పోస్టర్స్ చూస్తుంటేనే జిగర్తాండ చిత్రాన్ని చాలా మార్చినట్లుగా అనిపిస్తుంది.కాని హరీష్ శంకర్ మాత్రం అబ్బే ఎక్కువ మార్చలేదు అంటున్నాడు.మరి ఈయన మార్పిడి ఏ స్థాయిలో ఉందో తెలియాలి అంటూ మరో 10 రోజులు ఆగాల్సిందే.