కేసులతో విలవిల్లాడుతున్నా ఆయన పట్టించుకోవడంలేదా ?

తెలుగుదేశం పార్టీలో అంతా తామై చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

పార్టీలో మంచి గుర్తింపు ఉండి రాష్ట్ర స్థాయి నాయకులుగా చలామణి అయిన నాయకులంతా వరుస వరుసగా కేసుల్లో ఇరుక్కుని అల్లాడుతున్నారు.

ఇందులో కొంతమంది స్వయంకృపరాధంతో కేసుల్లో ఇరుక్కోగా మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇరికించినట్టు ప్రచారం జరుగుతోంది.ఏది ఏమైనా ఇప్పుడు ఒకరి తరువాత ఒకరన్నట్టుగా ఈ తాజా మాజీలు ఇరుక్కుంటున్నారు.

వీరి విషయంలో టీడీపీ అధినేత కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది.ఎందుకంటే వీరిలో కొంతమంది చేసిన తప్పులు కారణంగా ప్రజల్లో కూడా నవ్వుల పాలు అవ్వడంతో వీరిని వెనుకేసుకొస్తే ఆ అపకీర్తి మూటగట్టుకోవాల్సి ఉంటుందని బాబు కూడా ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది.

అయితే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్న నాయకులంతా వైసీపీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నవారే కావడంతో రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది.

Advertisement

ముఖ్యంగా చెప్పుకుంటే గత టీడీపీ ప్రభుత్వంలో నరసారావు పేట నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై స్పీకర్ గా పనిచేసిన టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు పై మొదటి నుంచి వైసీపీ టార్గెట్ చేసుకుంది.ముందుగా కోడెల కొడుకు, కుమార్తెల అవినీతి బాగోతాలు వెలికితీసి వారిని కేసుల్లో ఇరికించారు.ఆ తరువాత కోడెల పై దృష్టిపెట్టగా ఎవరూ ఊహించని రేంజ్ లో ఆయన అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి.

అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు, కంప్యూటర్ల మాయంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఆరోపణలు పెద్ద ఎత్తున రావడమే కాకుండా వాటిని తీసుకెళ్లినట్టు ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు.దీంతో టీడీపీ కూడా ఆయన విషయంలో గట్టిగా మాట్లాడలేక చేతులేత్తిసింది.

ఆఖరికి చంద్రబాబు కూడా కోడెల తప్పు చేస్తే శిక్షించండి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసాడు.తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ల్యాబ్ నిర్వహణ దందా బయటపడింది.రుయా ఆస్పత్రిలో రూ.4 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక పరికరాలున్నాయి.వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన నిపుణులు ఉన్నారు.

అయినప్పటికీ అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఒత్తిడి మేరకు రుయా ఆస్పత్రిలో ల్యాబ్‌ నిర్వహణను లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్‌కు ల్యాబ్‌ను అప్పగించారన్నది ప్రధాన ఆరోపణ.ఇందులో చాలా పెద్ద అవినీతి జరిగినట్టు లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఇటు టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో అధికారులపై తీవ్రంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.అలాగే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది.ఇడిమేపల్లిలోని 2.40 ఎకరాలకు సంబంధించి దొంగ పత్రాలు సృష్టించారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.దీనిలో సోమిరెడ్డి ఏ1 నిందితుడిగా పోలీసులు చేర్చారు.

Advertisement

ఈ భూమిని కొన్న మేఘనాథ్, జయంతి, సుబ్బారాయుడు అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.తాజాగా మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు సరుబుజ్జిలి ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్‌ చేసినేదుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.ఇలా చూసుకుంటే టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పి వైసీపీ ని అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టిన వారంతా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

వీరి విషయంలో చొరవగా ముందుకు వెళ్లి పోరాడామనుకున్నా వారు చేసిన నిర్వాహకాలు ఎక్కడ పార్టీకి అంటుకుంటాయో అన్న ఆందోళన టీడీపీ అధినేతలో కనిపిస్తోంది.

.

తాజా వార్తలు