అసెంబ్లీ లో ఒక సభ్యుడు చేసిన పనికి ఏకంగా సభ నే వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ ఘటన భారత్ లో కాదు లెండీ కెన్యా లో చోటుచేసుకుంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక సభ్యుడు ఏమి తినొచ్చాడో తెలియదు కానీ ఆయన గారు వదులుతున్న గాలి కి సభలో ఉన్న వారు అందరూ కూడా అల్లాడిపోయారు.దీనితో ఈ విషయం స్పీకర్ వరకు చేరడం తో స్పీకర్ గారు కూడా వెంటనే స్పందించి సభను వాయిదా వేశారు.
కెన్యా లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అక్కడి మీడియా కధనాల ప్రకారం స్టాక్ మర్కెట్స్ గురించి సీరియస్ గా చర్చిస్తున్న సమయంలో ఎవరో సభ్యుడు సభలో వాసనలు వదులుతున్నారు అని మరో సభ్యుడు లేచి స్పీకర్ కు ఫిర్యాదు చేసాడు.
భరించలేని వాసనలు వదులుతున్నారు,కంపు భరించలేకపోతున్నాం అంటూ ఫిర్యాదు చేయడం తో వెంటనే స్పీకర్ స్పందించి సభను వాయిదా వేశారు.

అనంతరం సభలో అసెంబ్లీ సిబ్బందితో రూమ్ ఫ్రెషనర్లు (వెనీల, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లు) స్ప్రే చేయించారు.అసెంబ్లీలో వాసన పూర్తిగా పోయాక మళ్లీ సభ్యులు మళ్లీ లోపలికి అడుగు పెట్టారు.మొత్తానికి ఆ కంపు దెబ్బకు సభ్యులంతా కాసేపు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.







