గత కొద్దీ రోజులుగా ఏపీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిన అంశం టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారబోతున్నారు అని.ఈ అంశం పై గత కొద్దీ రోజులుగా విపరీతంగా చర్చజరుగుతోంది.
అయితే నిన్నటివరకు కూడా ఈ చర్చపై బోండా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇటీవల విదేశీ పర్యటన లో ఉన్న ఉమా పై సోషల్ మీడియా లో ఇదే టాపిక్ పై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.
ఒకానొక స్టేజ్ లో ఆయన బంగి జంప్ ఫోటోలను షేర్ చేస్తే ఈ జంప్ ఎక్కడకి అంటూ చర్చ కూడా జరిగింది.అయితే మొత్తానికి ఈ రోజు ఈ న్యూస్ పై టీడీపీ కి ఒక సమాధానం దొరికింది.
విదేశీ పర్యటనలో ఉన్న ఉమా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చారు బోండా ఉమా.ఈ సందర్భంగా ఆయన పార్టీ మార్పు పై తొలిసారి స్పందించారు.ఎలాంటి పార్టీ మార్పు లేదని,చంద్రబాబు తోనే ఉంటానని,పార్టీ మారె ప్రసక్తే లేదని చెప్పినట్లు తెలుస్తుంది.స్వదేశానికి చేరుకున్న బోండా ఉమా తో చర్చించడానికి శనివారం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వెళ్లారు.
ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం దీనిపై ఉమా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.టీడీపీ లోనే కొనసాగుతానని,వైసీపీ కండువా కప్పుకొనని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు బుద్దాను ఉమా దగ్గరకు పంపి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.ఈ ఇద్దరు నేతలు తాజా రాజకీయాలపై చర్చించగా అనంతరం పార్టీ మార్పు పై కూడా చర్చ రావడం తో ఉమా పై విషయాన్నీ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఉమా స్పష్టత ఇవ్వడం తో టీడీపీ కొంచం ఊపిరి పీల్చుకుంది.







