బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా సినీ ఇండస్ట్రీలో విజయం అనేది అంత ఈజీగా దక్కదు.మొదటి సినిమా వరకు ఎదో కొంత క్రేజ్ వస్తుంది.
కానీ సినిమా ఆడియెన్స్ కి సినిమా నచ్చకుంటే ఎంత ఖర్చు పెట్టి సినిమా చేసినా వర్కౌట్ కాదు.అసలు మ్యాటర్ ఏమిటంటే.
ఇప్పుడు బెల్లంకొండ హీరో రాక్షసుడు సినిమాతో ఒరిజినల్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు.

జీవితంలో ప్రతి వ్యక్తికి జెర్సీ మూమెంట్ వస్తూనే ఉంటుంది.నాని రైల్వే స్టేషన్ లో అరిచే సీన్ ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోలేరు.బెల్లంకొండ కూడా అపజయాలకు అలసిపోయి ఒక్కసారి విజయంతో అరిచినట్లుగా రాక్షసుడు సినిమా మంచి అనుభవాన్ని ఇచ్చింది.
తమిళ్ రాట్ససన్ కు రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.

రివ్యూలు కూడా సినిమాకు బాగానే వచ్చాయి.ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో బెల్లంకొండ ఎమోషనల్ అయ్యాడు.ఇక నుంచి ఇలాంటి కాన్సెప్ట్ కథలను ఎంచుకుంటాను అని కమర్షియల్ కథలకు వీలైనంత వరకు దూరంగా ఉంటానని చెప్పాడు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ స్టువర్ట్ పురం నాగేశ్వరరావు బయోపిక్ తో బిజిగా ఉన్నాడు.







