టెక్సాస్ లో తెలుగు వారి నౌకా విహారం..!!!

టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం) టెక్సాస్ లోని లూయిస్ విల్ సరస్సులో నౌకా విహారం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి సంఘం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

 Telugu People Excursion In New Texas-TeluguStop.com

అలాగే వనితా వేదిక తరుపున శ్రీ లక్ష్మీ మండిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా సాగింది.టాంటెక్స్‌ ప్రెసిడెంట్ వీర్నపు చిన్న సత్యం అందరికి స్వగతం పలుకగా, లూయిస్ విల్ లేక్ యాజమాన్యం టాంటెక్స్‌ సభ్యులు బోటులోకి అందరిని ఆహ్వానించారు.

టెక్సాస్ లో తెలుగు వారి నౌకా వ

సుమారు సాయంత్రం 4:30 గంటలకు లాహిరి లాహిరి అనే పాటలతో ప్రయాణం మొదలు పెట్టారు.బింగో , అంత్యాక్షరీ, డం షరేడేస్, వంటి ఆట పాటలతో సుమారు 4 గంటల పాటు సరస్సు మధ్యలో వారు హాయిగా విహారం చేశారు.బోటు షికారు సమయంలో విచ్చేసిన వారికి భోజన సదుపాయాలని సంస్థ సభ్యులు కల్పించారు.అదేవిధంగా తెలుగు వంటల రుచులు వడ్డించారు.

టెక్సాస్ లో తెలుగు వారి నౌకా వ

అమెరికాలో ఉంటున్న వారిని చూసేందుకు వచ్చిన తల్లి తండ్రులని, భందువులని సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములని చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి అధ్యక్షుడు చిన సత్యం అందరికి కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube