టెక్సాస్ లో తెలుగు వారి నౌకా విహారం..!!!

టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం) టెక్సాస్ లోని లూయిస్ విల్ సరస్సులో నౌకా విహారం ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి సంఘం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

అలాగే వనితా వేదిక తరుపున శ్రీ లక్ష్మీ మండిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా సాగింది.

టాంటెక్స్‌ ప్రెసిడెంట్ వీర్నపు చిన్న సత్యం అందరికి స్వగతం పలుకగా, లూయిస్ విల్ లేక్ యాజమాన్యం టాంటెక్స్‌ సభ్యులు బోటులోకి అందరిని ఆహ్వానించారు.

"""/"/ సుమారు సాయంత్రం 4:30 గంటలకు లాహిరి లాహిరి అనే పాటలతో ప్రయాణం మొదలు పెట్టారు.

బింగో , అంత్యాక్షరీ, డం షరేడేస్, వంటి ఆట పాటలతో సుమారు 4 గంటల పాటు సరస్సు మధ్యలో వారు హాయిగా విహారం చేశారు.

బోటు షికారు సమయంలో విచ్చేసిన వారికి భోజన సదుపాయాలని సంస్థ సభ్యులు కల్పించారు.

అదేవిధంగా తెలుగు వంటల రుచులు వడ్డించారు. """/"/ అమెరికాలో ఉంటున్న వారిని చూసేందుకు వచ్చిన తల్లి తండ్రులని, భందువులని సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములని చేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి అధ్యక్షుడు చిన సత్యం అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తులో మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..: డిప్యూటీ సీఎం భట్టి