మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ కొరటాల శివతో వర్క్ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.లుక్ లో అలాగే ఫిట్ నెస్ లో కొన్ని మార్పులు చేసి ఆగస్టులో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
కరెక్ట్ గా తన పుట్టిన రోజున ఆగస్టు 15న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్ పట్టాలెక్కేంత వరకు హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేలా లేదు.ఇప్పటికే 20 మందికి పైగా హీరోయిన్స్ ని చూసిన దర్శకుడు ఎవరిని ఫైనల్ చేయలేదు.ముందుగా కొత్త హీరోయిన్ ని ఒకే చేయాలని అనుకున్నప్పటికి ఎందుకో గాని వర్కౌట్ కాలేదు.
ఇక సీనియర్ హీరోయిన్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే ఆ లిస్ట్ లో కాజల్ చేరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఖైదీ నెంబర్ 150లో మెగాస్టార్ తో చిందులేసిన చందమామ మరోసారి మెగాస్టార్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
ఇంకా ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైనల్ డిసిషన్ తీసుకోలేదు.నిర్మాత రామ్ చరణ్ త్వరలో హీరోయిన్ ని ఫైనల్ చేయాలని కొరటాల శివతో ఇటీవల చర్చించాడు.
కానీ కాజల్ హవా తగ్గుతున్న సమయంలో మళ్ళీ ఆమెను మెగాస్టార్ వద్దకు తీసుకురావడం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.