కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే.ఇంకా ఆ బాధ నుంచి బయటపడకుండానే కాంగ్రెస్ కు మరో సీనియర్ నేత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధి బారిన పడిన ఆయన కొంతకాలంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని,పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.దీనితో ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుస్తుంది.
మరోపక్క ముఖేశ్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్పిటల్‌కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ప్రస్తుతం ముఖేష్‌గౌడ్‌కు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు తెలిపారు.అయితే కాంగ్రెస్ నేతలు కూడా ముఖేష్ ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే జైపాల్ రెడ్డి లాంటి సీనియర్ నేత మృతి నుంచి కోలుకోలేని కాంగ్రెస్ కు ఇప్పుడు మరో సీనియర్ నేత ఆరోగ్యం విషమంగా ఉండడం మరింత ఆందోళన చెందుతుంది.







