ఇప్పుడు అమెరికా ప్రజలకి అమీబా భయం పట్టుకుంది.నీటిలో ఆకారం లేకుండా ఉండే అమీబాని చూసి ప్రజలు భయపడటం ఏంటి అనే డౌట్ అందరికి రావొచ్చు.
కాని ఇప్పుడు ఈ అమీబా కారణంగా అమెరికాలో ఓ కొత్త రకం వ్యాధి వస్తుందని డాక్టర్లు గుర్తించారు.మనిషికి కేవలం వారం రోజుల వ్యవధిలో చంపేసే వ్యాధి బ్రేయింగ్ఈటింగ్ అమీబా కారణంగా వస్తుందని తెలుసుకున్నారు.
దీనికి కారణంగా నార్త్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి అత్యంత అరుదైన అమీబా బారిన పడి ప్రాణాలు కోల్పోవడమే.
కంబెర్లాండ్ కౌంటీలోని హోప్ మిల్స్ వాటర్ పార్క్‌లోని కృత్రిమ చెరువులో ఈతకొట్టిన అతనికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకింది.
దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.వేసవిలో తాజా నీటిలో కనిపించే ఈ అమీబా కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు.
ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా నెగ్లేరియా ఫొవ్లేరి అనే వ్యాధితో అతడు మృతి చెందాడని, కలుషిత నీటిలోకి దిగినప్పుడు ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరుతుందన్నారు.ఇన్ఫెక్షన్ సోకిన ఐదు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వివరించారు.
ఆ తర్వాత ఐదు రోజులకు మనిషి ప్రాణాలు పోతాయని పేర్కొన్నారు.ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో నీరు కాలుష్యం చాలా వేగంగా జరుగుతుంది.
ఈ నేపధ్యంలో ఈ అమీబా మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు భయపడుతున్నారు.







