శివాజీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడా?

ఏపీ రాజకీయాలలో ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ బీజేపీ మీద ముప్పేట దాడి చేసిన సినీ హీరో శివాజీ ఎప్పటికప్పుడు మీడియా ముందుకి వచ్చి సంచలన విషయాలు బయ పెట్టబోతున్నా అంటూ హడావిడి చేసేవాడు.

ఎన్నికల తర్వాత రిజల్ట్ కి ముందు ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్పుకొచ్చి రాజకీయాలలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాడు.

ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇతర నేతల మీద కంటే శివాజీని విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించే వారు.అయితే ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన అతని మెడకి టీవీ 9 కేసు చుట్టుకుంది.

అతని మీద హైదరాబాద్ లో కేసు నమోదు కావడంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసారు.ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా విదేశీ ప్రయాణాలకి శివాజీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకి వచ్చిన శివాజీ తనని తెలంగాణా కేసీఆర్, ఏపీలో వైసీపీ ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు కేసులు బనాయించి తనని మానసికంగా దెబ్బ తీస్తున్నారని చెప్పుకొచ్చారు.త్వరలో తాను అధికారికంగా రాజకీయాలలో చేరబోతున్నాను అని ప్రకటించిన శివాజీ ఒక జాతీయ పార్టీలో చేరుతానని చెప్పుకొచ్చారు.

Advertisement

జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు అనేవి ఉండవని కూడా చెప్పాడు.తనని దెబ్బ తీసి సినిమా చూపించాలని అనుకుంటున్న వారికి త్రీడీలో సినిమా చూపిస్తా అని సంచలన కామెంట్స్ చేసారు.

ఇదిలా ఉంటే తాను జాతీయ పార్టీలో చేరుతానని చెప్పిన నేపధ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శివాజీ కచ్చితంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఇప్పుడు రాజకీయాలో టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు