బద్దలైన బర్నింగ్ స్టార్! ఏకదాటిగా మూడు నిమషాల డైలాగ్

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు.సెటైరికల్, స్పూఫ్ మూవీగా వచ్చిన ఆ సినిమా సంపూకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి టాలీవుడ్ లో టాప్ కమెడియన్ ని చేసింది.

 Burning Star Sampoornesh Babu Movie Kobbarimatta Three Minutes Dialogue1-TeluguStop.com

ఆ సినిమా దెబ్బ తో సంపూకి కమెడియన్ గా, హీరోగా వరుసగా అవకాశాలు వచ్చాయి.వచ్చిన అవకాశాలాని రెండు చేతులా ఒడిసిపట్టుకొని తన మార్క్ మేనరిజమ్స్ తో కమెడియన్ గా ట్రాక్ లో పడ్డ సంపూకి ఊహించని విధంగా మరల అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే చాలా కాలం తర్వాత మరల బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా కొబ్బరిమట్ట సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.తాజాగా ఈ చిత్రంలో మూడు నిమిషాల 27 సెకన్ల పాటు ఓ డైలాగ్ ను సంపూ ఏకదాటిగా చెప్పాడు.

ఈ డైలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఇంత పెద్ద డైలాగ్ ను సింగిల్ టేక్ లో, సింగిల్ షాట్ లో ఇంత వరకూ ఎవరూ చెప్పలేదని, ఇది ప్రపంచ రికార్డుగా చిత్ర యూనిట్ పేర్కొంది.

ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలూ కళ్లుగా మారాలో, వాడు రాబోతున్నాడు అంటూ ఈ వీడియో ప్రారంభమైంది.ఇక ఈ డైలాగ్ తో కొబ్బరి మట్ట సినిమాకి సంపూ మంచి బూస్టింగ్ ఇచ్చాడు అని చెప్పాలి.

మరి ఈ బూస్టింగ్ సినిమా సక్సెస్ లో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube