త్రిపుల్ తలాక్ తో విడాకులు ఇచ్చిన మాజీ రాజు గారు

మలేషియా మాజీ రాజు సుల్తాన్ మొహమ్మద్ తన భార్య రష్యా బ్యూటీ క్వీన్ రిహానా ఒక్సానా గోర్బటెంకో కు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే రాజు గారు భార్య కు ఎలా విడాకులు ఇచ్చారో తెలుసా త్రిపుల్ తలాక్ చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చినట్లు సుల్తాన్ తరపు లాయర్ తెలిపారు.

ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తి భార్యకు ఈ విధంగా త్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడం ఏంటి అని అందరూ ముక్కున వెలుసుకుంటున్నారు.

అంతేకాకుండా మలేషియా చరిత్రలో ఈ విధంగా త్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన రాజు గా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.అయితే పెళ్ళైన రెండేళ్లకే వీరి విడాకుల విషయం బయటకు రావడం తో మలేసియా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల రిహానా ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.మరి ఇద్దరి మధ్య ఏమి సమస్యో తెలియదు కానీ ఈ విధంగా విడాకులు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశ మైంది.

Advertisement

రెండేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగినా గతేడాదే వీళ్ల పెళ్లి విషయం తెరపైకి వచ్చింది.అప్పటి నుంచీ కూడా ఆయన మెడికల్ లీవ్‌లో ఉన్నారు.

ఐతే 2019 లోనే ఆయన తన పదవి కి కూడా దూరమయ్యారు.

మరి ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సుల్తాన్ మొహమ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నారా మరేదైనా కారణం ఉందా అన్న విషయం మాత్రం తెలియదు.ఇక మిస్ రిహనా ఒక్సానా గోర్బటెంకో మాత్రం తనకు విడాకులు ఇచ్చిన విషయమే తెలియదని అంటోంది.సుల్తాన్ మొహమ్మద్ ని తన భర్తగానే భావిస్తానని తెలిపింది.

సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తానని ప్రకటించింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు