యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే విషయంలో ఏ క్లారిటీకి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది.ఒక పక్క చూస్తే సినిమాల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు.
వరుస వరుసగా ఆఫర్లు వస్తుండడంతో రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ సినీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.ఇదే సమయంలో తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ కావడంతో ఎప్పటికైనా జూనియర్ పార్టీ పగ్గాలు తీసుకుంటాడని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవిష్యత్తు ఏంటి ? ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుండగానే ఇప్పుడు వైసీపీ నుంచి ఆయనకు పిలుపులు మీద పిలుపులు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే గందరగోళంగా ఉన్నట్టే కనిపిస్తోంది.ఇక చంద్రబాబు వయసు రీత్యా కూడా టీడీపీని ముందుకు నడిపించే నాయకుడు అవసరం.ఈ నేపథ్యంలో అందరి చూపు ఎన్టీఆర్ మీదే పడింది.
ఆయన పార్టీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి టీడీపీ పగ్గాలు చేపడతారని అంతా అనుకుంటున్నారు.అయితే ఎన్టీఆర్ మాత్రం టీడీపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాడట.
గతంలో తనకు, తన తండ్రి హరికృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం తగ్గించిన విషయాన్ని ఇప్పటికీ ఎన్టీఆర్ మర్చిపోలేకపోతున్నాడట.ఇక చంద్రబాబు కూడా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తున్నాడు తప్ప ఎన్టీఆర్ ను చేరదీసే ఆలోచనలో లేడు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ను ఎలా అయినా వైసీపీకి దగ్గరయ్యేలా చేయలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు.అందుకే డైరెక్ట్ గా పార్టీలో చేరమని చెప్పలేక ముందుగా ఆయనకు ఏదైనా పదవి ఇచ్చి మెల్లిగా పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నాడు.దీనిలో భాగంగానే ఏపీ టూరిజం శాఖకు ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేయలని అనుకుంటున్నాడట.ఇప్పటికే ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడైన కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.
వీరి చొరవతోనే జగన్ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లినట్టు తెలుస్తోంది.అయితే ఎన్టీఆర్ మాత్రం తన తాత స్థాపించిన పార్టీని కాదని వైసీపీలోకి వెళ్తే లేనిపోని విమర్శలు వస్తాయని భావించే దీనిపై ఎటువంటి క్లారిటీకి రాలేకపోతున్నాడట.






