ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఏపీలో బలపడేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ వచ్చే ఎన్నికలనాటికి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది.
దీనిలో భాగంగానే ఏపీ బీజేపీకి ఊపు తీసుకొచ్చే నాయకుడి కోసం ఎదురుచూపులు చూస్తోంది.ఈ క్రమంలోనే ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి తో సంప్రదింపులు చేస్తూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ అగ్రనేత ఒకరు మంతనాలు చేసినట్టు తెలుస్తోంది.తానా సభలకు హాజరైన పవన్ ప్రవాసాంధ్రుల మద్దతు కూడగట్టుకోవడమే కాకుండా కొన్ని కీలక రాజకీయ చర్చలు జరుపుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా ఇదే సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.వీరి మధ్య దాదాపుగా రెండు, మూడు గంటల పాటు చర్చలు జరిగాయని.
తెలుస్తోంది.వీరి భేటీకి షెడ్యూల్ ఫిక్స్ అయినట్టు అర్ధం అవుతోంది.
దానికి తగ్గట్లుగానే ఎజెండా ప్రకారమే సమావేశం జరిగిందని, సమావేశం మొత్తం రాజకీయ అంశాలపైనే జరిగినట్లు సమాచారం.వాస్తవంగా ఏపీలో టీడీపీ మీద ఉన్న కోపంతో రాజకీయంగా వైసీపీకి సహకరించినప్పటికీ ఇప్పుడిప్పుడే ఆ విధానం మార్చుకుంటోంది.
వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తోంది.ఈ నేపధ్యంలోనే జగన్ కు దూరంగా జరిగి పవన్ కు దగ్గరవ్వాలని బీజేపీ చూస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.
కలిసి పనిచేద్దామనే బీజేపీ ఆఫర్ కు పవన్ సానుకూలంగా స్పందించినా కొన్ని రకాల దెమంద్స్ పెట్టినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా ఏపీకి విభజన హామీల ప్రకారం ఇవ్వాల్సిన వాటిని ఇచ్చిన తర్వాతే కలసి పని చేద్దామని సూచించినట్లు చెబుతున్నారు.ప్రత్యేక హోదా విషయంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని పవన్ కల్యాణ్ డిమాండ్ పెట్టినట్టు సమాచారం.అంతేకాకుండా ఏపీ ప్రయోజనాల విషయంలో బీజేపీ సానుకూలంగా స్పందించడంవల్ల రానున్న రోజుల్లో మరింత రాజకీయ ప్రయోజనం కలుగుతుందని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా అనేక రాజకీయ అంశాలకు సంబంధించి వీరి ఇరువురి మధ్య చర్చ జరిగిందని, మరోసారి క్షుణ్ణంగా అన్ని విషయాల మీద చర్చించుకుందామని పవన్, రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారట.