బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’.ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు నటిస్తున్న కారణంగా ఆకాశమే హద్దుగా సినిమాపై అంచనాలు ఉన్నాయి.
అలాంటి సినిమా గురించిన చిన్న విషయం అయినా కూడా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలుగజేస్తోంది.అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వీరిద్దరి కాంబో మూవీ అంటూ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉండబోతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యి పలు సీన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి హీరోల లుక్స్ మాత్రం బయటకు రాలేదు.కొన్ని లీక్డ్ పిక్స్ తప్ప అధికారికంగా బయటకు రాలేదు.
కాని తాజాగా ఒక ఎన్టీఆర్ పోస్టర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.కొమురం భీం లుక్‌లో ఉన్న ఎన్టీఆర్ అంటూ ఆ పోస్టర్ హల్చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ లుక్ అదిరింది అంటూ అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే అసలు విషయం ఏంటీ అంటే అదో ఫేక్ పోస్టర్.

జై లవకుశ సినిమాలోని ఒక స్టిల్‌ను తీసుకుని ఎవరో ఎన్టీఆర్ అభిమాని ఈ సినిమా పోస్టర్ అంటూ పోస్ట్ చేశాడు.దాంతో ఇది ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ అనుకుని అంతా కూడా హంగామా మొదలు పెట్టారు.దీనికి సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయలేదు.దానికి తోడు దీన్ని ఎవరు కూడా అధికారికంగా దృవీకరించలేదు.కాని కొందరు మాత్రం ఇది ఆర్ఆర్ఆర్ మూవీ స్టిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చిత్రం గురించి ఇంకెన్ని ఫేక్ వార్తలు వినాల్సి వస్తుందే మరెన్ని ఫేక్ పోస్టర్స్‌ను చూస్తామో.!
.