ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏపి ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలింది అనే విషయం అందరికీ తెలిసిందే.కేవలం ఏపీ మొత్తం ఒక్క స్థానానికి జనసేన పార్టీ పరిమితమైపోయింది.
ఇదిలా ఉంటే ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయి ఏకంగా మూడో స్థానానికి పడిపోయాడు.ఓ విధంగా పవన్ కళ్యాణ్ ఓటమిని జనసేన పార్టీ శ్రేణులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేశారని జనసేన పార్టీ కార్యకర్తల నుంచి నేతలు వరకు అందరూ ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా బరిలో దిగిన మెగా బ్రదర్ నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని అన్నారు.పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కరు 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయని నాగబాబు చెప్పుకు రావడం విశేషం.