అప్పుడప్పుడు ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి.కొంతమంది తమకు ఇష్టం లేని వ్యక్తులుపై విచిత్రమైన పద్ధతుల్లో పగ తీర్చుకుంటుంటారు.
తాజాగా చైనాలో కూడా అలాంటి ఓ విచిత్రమైన పనిచేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి హాట్ టాపిక్ గా మారాడు.చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ జినాన్ లో వ్యాపారవేత్త అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు.
అయితే ఆ ఇంటి ఓనర్ తో వ్యాపార వ్యాప్తికి ఏవో గొడవలు వచ్చాయి.
దీంతో వెంటనే తన అద్దె చెల్లించాలని ఇంటి ఓనర్ గట్టిగా పట్టు పట్టడం జరిగింది.అయితే ఈ విషయంలో ఓనర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన వ్యాపారవేత్త అద్దె రూపంలో ఏకంగా 15.17 లక్షలు చిల్లర పైసలు ఇచ్చాడు.ఏకంగా దీనికోసం 20 ప్లాస్టిక్ బకెట్లతో చిల్లర ఓనర్ కి పంపించాడు.ఆ చిల్లర బకెట్లు చూసి ఇంటి యజమాని షాక్ అయ్యాడు.అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి ఇంటికి ఓనర్ తీసుకోక తప్పలేదు.అయితే ఆ చిల్లర ఎంత ఉంది అనే విషయం తెలుసుకోవడానికి ఇంటి ఒంటర చివరికి 24 మంది ఉద్యోగులను రంగంలోకి దించి నాలుగు గంటల పాటు ఆ చిల్లర పైసలు లెక్కించి తీసుకున్నాడు.