మాయమైన బ్రిడ్జి....ఏమి జరిగింది

బ్రిడ్జి మాయమవ్వడమేంటి అని అనుకుంటున్నారా.నిజంగా ఇది నిజం అండీ 56 టన్నుల బరువైన వంతెన,75 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జి మాయమైపోయింది.

ఈ ఘటన చోటుచేసుకుంది ఎక్కడంటే రష్యా లోని ఒక్త్యా బ్రస్కాయా లో.అక్కడ అంబా నది పైన ఉన్న బ్రిడ్జి ఉన్నట్టుండి మాయమైనట్లు తెలుస్తుంది.దీనితో అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు.

అసలు ఏ పర్సో,పెన్నో మాయమైందంటే పర్లేదు.కానీ బ్రిడ్జి మాయమవ్వడం ఏంటి అని స్థానికులు ఆశ్చయపోతున్నారు.

భూమి పై ఉండే వంతెన మొదటి,చివరి భాగాలు మాత్రం అలాగే ఉన్నాయి కానీ అంబా నది ప్రవహిస్తున్న పై బ్రిడ్జి మాత్రం మాయమైపోయింది.అయితే స్థానికులు మాత్రం ఇది దొంగల పనే అని అంటున్నారు.

Advertisement

అయితే రష్యాలోని సోషల్ మీడియా సైట్ వీకేలో ఈ బ్రిడ్జి మాయమైందన్న వార్త మే నెలలోనే వచ్చినప్పటికీ ఎవరూ ఆ విషయాన్నీ నమ్మలేదు.

అయితే మే 16న వీకే సైట్‌లో బ్రిడ్జికి సంబంధించి కొత్త ఫొటో కనిపించింది.అందులో బ్రిడ్జి ముక్కలై నదిలో పడిపోయినట్లు ఉంది.కానీ మే 26న వచ్చిన ఏరియల్ ఫొటోలను చూస్తే, నది నీటిలో బ్రడ్జికి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ లేకపోవడం తో ఇది దొంగల పనే అని స్థానికులు చెబుతున్నారు.

అయితే ప్రకృతి విపత్తులు ఏమీ రాలేదని, అయినా ప్రకృతి విపత్తులకు విరిగిపోయేంత బలహీనంగా ఆ వంతెన లేదని అంటున్నారు.దీనితో అసలు ఈ వంతెన ఎలా మాయమైంది అన్న దానిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు