యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో.సుజిత్ దర్శకత్వంలో సెల్యులాయిడ్ పైకి వెళ్తున్న ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.
తాజాగ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ముంబైలోని చిత్రీకరిస్తున్నారు.ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నారని తాజాగా బయటకి లీక్ అయిన ఫోటోల బట్టి తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు సుజిత్ ట్వీట్ చేసాడు.
ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది.
ముంబైలో సాహో’ షూటింగ్ అని దర్శకుడు సుజిత్ పెట్టిన ట్వీట్ తో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు అనే విషయంపై అందరికి క్లారిటీ వచ్చేసింది.ఇదే చివరి ఈ షెడ్యూల్ అని తెలుస్తుంది.
ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ప్రస్తుత షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తుంది.ఇది పూర్తి కాగానే హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో మొదలయ్యే జాన్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తుంది.







