అద్దె కార్యకర్తల డిమాండ్ ఇంత అంతా కాదయా !

ఎన్నికలంటేనే భారీ వ్యయంతో కూడుకున్నది.అభ్యర్థి టికెట్ సంపాదించుకున్నప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు భారీగా ఖర్చుపెట్టాల్సిందే.

ఎన్నికల ప్రచారం, నామినేషన్, రోడ్ షో , ఇలా దేనికైనా భారీగా జనం కావాల్సిందే.ఈ జనమంతా ఎలా వస్తారు ? పార్టీ మీద అభిమానంతో కొంతమంది స్వచ్ఛందంగా వస్తారు మిగిలిన లోటంతా అద్దె కార్యకర్తలే తీర్చాలి.అసలే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థి కూడా తిరగాలంటే మాటలు కాదు.అందుకే ఈ అద్దె కార్యకర్తలకు డిమాండ్ బాగా పెరిగింది.

వివిధ పార్టీల అభ్యర్థులు, వారి ప్రధాన ప్రచార రథాల వెంట బ్యాడ్జీలు, టోపీలు, జెండాలు ధరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటమే ఈ అద్దె కార్యకర్తల ముఖ్యమైన విధి.

Advertisement

ఎన్నికల ప్రచార సమయంలో వివిధ పార్టీలు ఈ కాంట్రాక్టు సేవలు భారీగా పొందుతున్నాయి.కాంట్రాక్టు విధానంలో కూలీలను సమకూర్చే ప్రక్రియ ఈసారి ఎన్నికల్లో బాగా కనిపిస్తోంది.వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, వివిధ పనులకు కొందరు కూలీలను సరఫరాచేసే కాంట్రాక్టర్లు ప్రస్తుతం అద్దె కూలీలను సరఫరాచేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఫలానా పార్టీ అనే పట్టింపు లేకుండా ఏ పార్టీకైనా కూలీ ఆధారంగా ఎంతమంది కావాల్సి వస్తే అంతమందిని ప్రచారానికి పంపుతున్నారు.ఈ కూలీలు అభ్యర్థి ఇంటి వద్దకు ఆటోలపై చేరుకోగానే అక్కడ నుంచి ఆ రోజు ఏయే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలి అనేది అక్కడ వారికి హాజరు వేసి మరీ పురమాయింపు చేస్తున్నారు.

అద్దె కార్యకర్తలు డిమాండ్ ఎక్కువ ఉండడంతో వివిధ పార్టీల అభ్యర్థులు రేటు గురించి ఆలోచించకుండా తమ ప్రచారానికి జనాలను పురమాయిస్తున్నారు.దీంతో దూర ప్రాంతాల నుంచి కూడా కూలీలను తీసుకొచ్చి మరీ ప్రచారానికి వాడుకుంటున్నారు.దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారికి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అభ్యర్థి ఇంటి వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

ఎంతమంది వచ్చినా అక్కడ అల్పాహారం తినేసి ప్రచారానికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్న భోజనానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ అద్దె కార్యకర్తలకు పార్టీలతో సంబంధంలేదు.వారి కాంట్రాక్టరు ఏ పార్టీ ప్రచారానికి పంపిస్తే ఆ పార్టీ ప్రచారానికి వెళ్తుంటారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

వివిధ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులే ఇలా క్రాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి బాగా లాభపడుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు