అక్కడ పెళ్ళైన మూడు రోజుల వరకు బాత్రూమ్ కి వెళ్లకూడదు.. ఎందుకో తెలుసా !

పెళ్లి అనేది అమ్మాయికి గాని అబ్బాయికి గాని జీవితం లో మర్చిపోలేని ఒక మధురనుభూతి.

పెళ్లి అంటే ఇద్దరు కలిసి జీవితాంతం ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండబోతున్నాం అని చెప్పే ఒక సంధి.

పెళ్లి విషయం లో ఎక్కువ మంది వారి ఆచారాలను దృష్టి లో ఉంచుకొని పెళ్లి చేసుకుంటారు , వారు పురాతన ఆచారాలు పెద్దలు చెప్పిన విధంగా వాటిని పాటిస్తారు.కొన్ని ఆచారాలు సరదాగా ఉంటే మరి కొన్ని ఆచారాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

అవి వారికి ఆచారాలుగా అనిపించినా చూసే వారికి హింసాత్మకంగా అనిపిస్తాయి.అటువంటి ఆచారాలలో ఒక వింతైన ఆచారాన్ని ఇప్పటికి ఇండోనేషియా కి చెందిన ఒక తెగ పాటిస్తుంది.

ఇంతకీ ఆ వింత ఆచారం ఏంటంటే.

Advertisement

ఇండోనేషియా లోని ఉత్తర బ్రోనే కి చెందిన తైడాంగ్ అనే తెగ నూతన వదువరులకి పెళ్లి చేసాక కొన్ని వారి పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆచారాన్నీ ఇప్పటికి పాటిస్తున్నారు.అదేంటంటే పెళ్లయిన మూడు రోజుల వరకు భార్య భర్తల ఇద్దరు బాత్రూమ్ కి వెళ్లకూడదు.అలా చేయడం వల్ల దంపతులిద్దరూ కలకాలం కలిసి ఉంటారని వల్ల నమ్మకం.

ఈ విషయంలో వీరిపై పర్యవేక్షణ జరుగుతుంది.ఈ వింతైన ఆచారం ప్రకారం నూతన దంపతులు మూడు రోజుల పాటు కాలకృత్యాలను తీర్చుకోకూడదు.

అంటే మూడు పగళ్లు అలాగే మూడు రాత్రుల పాటు కాలకృత్యాలను తీర్చుకోకూడదు.ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా వారికి మంచి జరుగుతుందని అదృష్ట దేవత వారిని కరుణించి వారి కాపురం సజావుగా ఉంటుందని అక్కడి ప్రజల నమ్మకం.

ఈ ఆచారాన్ని పాటించకపోతే, ఆ దంపతుల మధ్యన విబేధాలు తలెత్తే ప్రమాదం ఏర్పడుతుందని, అలాగే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవవచ్చని నమ్మకం.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ ఆచారాన్ని పాటిస్తున్న సమయంలో దంపతులకు కేవలం కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందిస్తారు.దానివల్ల ఆ మూడు రోజులు వాళ్ళకి బాత్రూమ్ వెళ్లాల్సిన అవసరం రాదని వారు అలా చేస్తారు.ఈ ఆచారాన్ని తెలిసిన విదేశీయులు ఇలాంటి వింతైన ఆచారాలు కూడా ఉన్నాయా అని షాక్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు