ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల హామీలు ఇస్తూ, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.ఈ దశలో ఏపీలో కులాల వారీగా ఏ పార్టీకి ఎవరి మద్దతు ఉంటుంది అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.
ఏపీ ఎన్నికల్లో కులాల మద్దతు ప్రకారమే పార్టీల గెలుపోటములు నిర్ణయించబడతాయి.వాస్తవానికి దేశం మొత్తం మీద రాజకీయాలు కులాల ప్రకారమే జరుగుతూ ఉంటాయి.
అయితే ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి ఎవరి ఇష్టం వారికి ఉంటుంది.ఏపీలో వివిడ సర్వేలు నిర్వహించి అనేక సంస్థలు తేల్చిన విషయం ఏంటి అంటే కులాల మద్దతు ఆధారంగానే ఎన్నికల ఫలితాలు ఉంటాయని.

ఎన్నికల్లో కులాల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము.ఏపీలో టీడీపీకి కొన్ని కులాల మద్దతు , వైసీపీకి కొన్ని కులాల మద్దతు ఉంది.కాకపోతే ఆయా కులాల్లోని వారందరూ మూకుమ్మడిగా ఆ పార్టీకి ఓటు వేయకపోవచ్చు.ఇది నియోజకవర్గాల వారీగా కూడా మారుతుంది.వివిధ సర్వే లెక్కల ప్రకారం టీడీపీ వెనుక కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, కొప్పుల వెలమ, ఓబీసీలు, యాదవ సామాజికవర్గం కొన్ని చోట్ల టీడీపీకి మరికొన్ని చోట్ల వైసీపీకి అనుకూలంగా ఉంది.గోదావరి జిల్లాల్లో ప్రధాన సామాజికవర్గమైన శెట్టిబలిజ ఓట్లు అన్ని పార్టీలకు చాలా కీలకం.
గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు రావడానికి శెట్టిబలిజల ఓట్లే ఆధారం.గతంలో వీరంతా టీడీపీ కి అనుకూలంగా ఉండేవారు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సగం వైసీపీ, సగం టీడీపీ అన్నట్టుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.ఇక టీడీపీ కి కాపు సామజిక మద్దతు ఉన్నా జనసేన ప్రభావంతో ఆ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.

వైసీపీ కి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనార్టీ ఓట్లు ఎలాగూ ఉంటుంది.వైసీపీకి వీరి మద్దతు రావడానికి ముఖ్య కారణం గతంలో వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినవారే కావడం.ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలు, ఇతర వర్గాలు కాంగ్రెస్‌కు అండగా ఉంటూ వచ్చాయి.కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరగడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది.
యూపీ, బీహార్ తో సహా అనేక రాష్ట్రాల్లో అదే జరిగింది.రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడంతో వైసీపీ వైపు ముస్లిం లు డైవర్ట్ అయ్యారు.
గ్రామాల్లో దళితుల ఓటు వైసీపీకి, అగ్రకులాల ఓట్లు టీడీపీ వైపు ఉన్నట్టుగా పరిస్థితి ఉంది.
.






