ఒకప్పుడు తినడానికి అన్నం కూడా లేదు , ఇప్పుడు రోజుకి 1000 మంది ఆకలి తీరుస్తున్ అజహర్ గురించి అందరూ తెలుసుకోవాల్సిందే

అన్నదాత సుఖీభవ అంటాం , అలా మనం ఒకరి ఆకలి తీరిస్తే ఎంత ఆనందమే అలాంటిది రోజుకి 400 మంది ఆకలి తీరుస్తున్న ఒక హైదరాబాద్ యువకుడి కథ.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అజహర్ మఖ్సూసీ తెలుగు యువతకే కాదు దేశం లో ఉన్న యువతకందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అజహర్ మఖ్సూసీ తన చిన్న తనం తండ్రిని కోల్పోయాడు , పైగా నిరుపేద కుటుంబం ఎన్నో నిద్రలేని ఆకలి రాత్రులు అనుభవించాడు.అప్పుడే అనుకున్నాడు జీవితం లో ఎదో సాధించాలి , మెల్లిగా కష్టపడుతూ సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ బిసినెస్ ప్రారంభించాడు.

డబ్బు సంపాదించుకున్నాడు వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేసుకుంటూ ఉన్నాడు .

ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలన్న ఆలోచోన ఆ సమయం లో డబీర్ పురా బ్రిడ్జ్ దాటుతుండగా , ఆకలితో అన్నం కావాలని ఒకామె చాలా మందిని వేడుకుంటుంది, అది చూసిన అజహర్ కి తన బాల్యం రోజులు గుర్తొచ్చాయి వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని హోటల్ కి తీసుకెళ్లి అన్నం పెట్టించాడు.ఆ రోజు ఇంటికి వెళ్ళాక పడుకున్నపుడు ఆ బ్రిడ్జి దగ్గర ఆకలి తో వేసుకున్న మహిళనే గుర్తొచ్చింది.ఆ బ్రిడ్జి దగ్గర ఇంకా చుట్టూ పక్కల ఆకలితో దిక్కు తోచని స్థితిలో చాలా మంది ఉన్నారని తెలుసుకున్నాడు.

Advertisement

అప్పుడే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి కనీసం 200 నుండి 400 మందికి రోజు భోజనం పెట్టించాలని అనుకున్నాడు.తరువాత తన స్నేహితులతో కలిసి అంత మందికి భోజనం పెట్టించాలంటే ఎంత ఖర్చు అవుతుందో లేక వేసుకున్నాడు.

తామే అన్నం, కూరలు వండి సరఫరా చేస్తే.ఎంత తక్కువలో తక్కువగా చూసుకున్నా రోజుకు రూ.1500 నుండి రూ.2000 వరకు ఖర్చు అవుతుంది.అదీ 2015 నాటి మాట.ఇప్పుడు ఖర్చులు ఇంకా పెరగవచ్చు.అయినా ఆ సమయంలో అజహర్ అవేవీ ఆలోచించలేదు.

ఒక సంవత్సరం పాటు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో లెక్క వేసుకున్నారు.తన సంపాదన నుండి ఆ ఖర్చును భరించగలనని ఆయన భావించాడు.

రోజుకి దాదాపు 400 మందికి అన్నం

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అంతే.ఇంకేమీ ఆలోచించలేదు.కనీసం రోజుకు 400 మందికి ఆహారం అందించాలని ఆయన నిర్ణయించుకున్నాడు.

Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా ఆయన హైదరాబాద్ నగరంలో అలా అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నాడు.కానీ కొన్ని సందర్భాల్లో జనాల సంఖ్య పెరిగితే ఆయనకు కష్టమయ్యేది.

అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ జనాభా వస్తే.వారిని ఆకలితో వెనుతిరిగి పంపాలంటే బాధగా ఉండేది.

అందుకే ఈ విషయాన్ని తోటి వ్యాపారస్తులైన తన మిత్రులతో పంచుకున్నారు.ఈ క్రమంలో కూరలతో పాటు పప్పు, అన్నం ఒక్కొక్కరు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు.

దీంతో అజహర్‌కి కొంచెం భారం తగ్గింది.ఆ తర్వాత మరి కొందరు మిత్రులు ఆయనకు చేయూతనివ్వడంతో.

ఈ సేవా కార్యక్రమాన్ని బెంగళూరు, రాయచూర్, జార్ఖండ్, అస్సాం ప్రాంతాల్లో కూడా మొదలుపెట్టారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకి 1200 నుండి 1500 వరకు అన్నం పెట్టిస్తుంది అజహర్ ప్రారంభించిన ఆలోచన.

తాజా వార్తలు