నేడు మోడీ విశాఖ పర్యటన! కొత్త వరాల కోసం ఆశలు!

ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు పర్యటన తర్వాత మరో సారి ఏపీలో విశాఖపట్నంలో పర్యటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఈ పర్యటన నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం హడావిడిగా రైల్వే జోన్ ప్రకటించింది.

అయితే వాల్తేర్ డివిజన్ లేకుండా రైల్వే జోన్ ప్రకటించడంపై ఏపీ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై కొంత గుర్రుగా వున్నారు.ఇదిలా వుంటే మరో వైపు మోడీ ఈ రోజు వైజాగ్ పర్యటనలో ఏపీ ప్రజలకి రానున్న ఎన్నికలకి సంబంధించి హామీలు ఇచ్చే అవకాశం వుందని టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇదిలా వుంటే విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై పై మాట్లాడకుండా ఏపీ పర్యటిస్తున్న మోడీకి వామపక్షాలు నిరసనలతో స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నాయి.అలాగే ఏపీ అధికార పార్టీ కూడా మోడీ పర్యటన మీద నిరసన వ్యక్తం చేస్తుంది.

ఇదిలా వుంటే ఈ విశాఖ టూర్ లో మోడీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించే అవకాశం వుందని టాక్ వినిపిస్తుంది.మరో వైపు భద్రతా సమస్యలని ద్రుష్టిలో వుంచుకొని ప్రధాని పర్యటనకి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు