భారత్ ఒత్తిడికి దిగి వచ్చిన పాకిస్తాన్! ఫైలట్ ని రిలీజ్ చేయడానికి అంగీకారం!

భారత్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఫైలట్ అభినందన్ ని నిన్న పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

మిగ్ విమానం కూలిపోయిన టైంలో అందులోంచి తప్పించుకొని పాక్ భూభాగంలో ప్రవేశించిన అభినందన్ ని పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకొని అతనిని అడ్డు పెట్టుకొని భారత్ పై ఒత్తిడి పెంచాయాలని ప్రయత్నించింది.

అయితే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎ దేశం నుంచి మద్దతు లభించకపోవడంతో పాటు, మిత్ర దేశాల నుంచి కూడా పాకిస్తాన్ కి హెచ్చరికలు వస్తున్న నేపధ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం దారిలోకి వచ్చింది అని చెప్పాలి.దౌత్య పరంగా పాకిస్తాన్ ని ఒంటరి చేసి సైనికుడు ని తక్షణం విడిచిపెట్టి తమకి అప్పగించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రధాని మోడీ, రక్షణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

ఈ నేపధ్యంలో ముందు కొత్త బెట్టు చేసి చర్చలకి వస్తే సైనికుడుని అప్పగిస్తామని చెప్పింది.అయితే సైనికుడుని తమకి అప్పగించే వరకు చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పేసింది.

దీంతో దారిలోకి వచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ప్రకటన చేసారు.సరిహద్దులో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గిన తర్వాత అభినందన్ ని ఇండియన్ కి అప్పగిస్తామని చెప్పింది.

Advertisement

ఈ నేపధ్యంలో వారం నుంచి నెల రోజులలో అభినందన్ కి పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ కి అప్పగించే అవకాశం వుందని తెలుస్తుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు