వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రం మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ముందు నుండి ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు.
వైఎస్ఆర్ బయోపిక్ అనగానే పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు.కాని సినిమా విడుదల తర్వాత మాత్రం సినిమాపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.‘యాత్ర’ సినిమా విడుదలకు వారం రెండు వారాల పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహించారు.దాంతో ‘యాత్ర’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
అంచనాలకు తగ్గట్లుగా వైఎస్ అభిమానులను అలరించే విధంగా సినిమా రూపొందింది.ఇదే సమయంలో యాత్రకు ఎన్టీఆర్ కథానాయకుడికి పోలిక పెట్టి ప్రేక్షకులు సినిమాను చూస్తున్నారు.
‘యాత్ర’ సినిమాలో కూడా ఎలాంటి వివాదాలకు పోకుండా జాగ్రత్తగా సినిమాను తీశారు.ఎక్కడ ఎలాంటి వివాదం లేకపోయినా కూడా యాత్ర సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వివాదాస్పద అంశాలు లేని కారణంగా పెద్దగా కలెక్షన్స్ రాలేదు.కథానాయుడు సినిమా విషయంలో ప్రేక్షకులు మొదట పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కాని కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.యాత్ర సినిమాకు పెద్దగా అంచనాలు లేక పోవడం విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ విషయంలో ఎన్టీఆర్ను బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా కంటెంట్ పరంగా చూసుకుంటే రెండు కూడా మంచి టేకింగ్తో తీశారు, రెండు సినిమాల్లో కూడా ఎలాంటి వివాదాస్పద అంశాలను టచ్ చేయలేదు.కాని ఎన్టీఆర్ పై వచ్చిన హైప్ యాత్రకు రాలేదు.దాంతో యాత్ర అంచనాలు అందుకోవాల్సిన అవసరం రాలేదు.కాని ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మాత్రం అంచనాలు భారీగా ఉండటం వల్ల అంచనాలను అందుకోలేక పోయింది.మొత్తానికి ఎన్టిఆర్ కంటే యాత్రకు బాక్సాఫీస్ వద్ద సందడి ఎక్కువగా కనిపిస్తోంది.