జనసేన పార్టీ రాజకీయంగా స్పీడ్ పెంచింది.ఇప్పటివరకు పెద్దగా కమిటీల నియామకంపై జనసేన పెద్దగా దృష్టిపెట్టలేదు.
ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో 22 కమిటీల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఇవాళ తొలి జాబితా విడుదల చేసారు.మరో జాబితాలో మరింత మంది మహిళలకు చోటు కల్పిస్తానని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.
మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్న కమిటీలకు పూర్తి భిన్నంగా ఈ కమిటీలు పనిచేస్తాయని పవన్ చెప్పుకొచ్చారు.పార్టీ అధ్యక్షుని నేతృత్వంలో పార్టీ కేంద్ర కమిటీ పనిచేస్తుంది.
ఈ కేంద్ర కమిటీతో పాటు ప్రెసిడెంట్ జనరల్ , అడ్మినిస్ట్రేషన్ డివిజన్ ను ఏర్పాటు చేశారు.
దీనిలో అనేక ప్రజాపయోగ కౌన్సిల్స్, కమిటీలను ఏర్పాటు చేశారు.వీటిలో సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలివిడతగా చోటు కల్పించారు.భారతదేశ రాజకీయాలలో జవాబుదారీతనం తీసుకురావాలనే పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్ , మహిళాశక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న ఆలోచనతోనే… జనసేన పార్టీ కమిటీల్లో పెద్ద పీట వేసినట్టుగా తెలుస్తోంది.