ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ… సంచలన ప్రకటన చేసాడు.అయితే ఆయన తప్పుకుంటాను అన్నది మాత్రం వేరే సందర్భాన్ని ప్రస్తావిస్తూ… ఇంతకీ చంద్రబాబు అలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే….
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా….ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలవరానికి జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చారని.ఏ జాతీయ ప్రాజెక్ట్ పనులైనా పోలవరం అంత వేగంగా జరుగుతున్నాయా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తిచేశామన్నారు.దేశంలో ఏ ప్రాజెక్ట్ పనులైనా …ఈ స్థాయిలో జరుగుతున్నాయని నిరూపిస్తే.రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఏపీ బాగుపడితే…తమిళనాడుకి నీళ్లు ఇస్తే.తప్పా అంటూ ప్రశ్నించారు.నదుల అనుసంధానం చేస్తామని తిరుపతిలో మోదీ చెప్పారని.
కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు.పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఏపీ మాత్రమే అన్నారు.