తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ కేసుకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
వారం రోజుల్లోగా… విచారణకు హాజరుకావాలంటూ… ఆ నోటీసులో పేర్కొన్నారు.శుక్రవారం ఈడీ అధికారులు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.అలాగే రూ.50 లక్షలపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
అసలు ఈ కేసు వివరాలు పరిశీలిస్తే….2015లో ఈ ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వచ్చింది.ఈ కేసులో అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.గతంలో ఆయన తెలంగాణ ఏసీబీ అధికారుల విచారణకు కూడా హాజరయ్యారు.తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపారు.ఓటుకు నోటు కేసు సమయంలో నరేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు.
ఈ కేసు మరింత వేగం పెంచే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టు కనిపిస్తోంది.