ప్రశాంత్ కిషోర్ ! అలియాస్ పీకే … వైసీపీ రాజకీయ వ్యూహకర్త గా పాగా పాపులర్ అయిన పేరు.మొదట్లో వైసీపీకి యాక్టివ్ గా సలహాలు… సూచనలు ఇచ్చిన ఆయన మధ్యలో బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో వైసీపీ మీద ద్రుష్టి కొంతమేర తగ్గించాడు.అయితే… తన టీమ్ మాత్రం జగన్ కోసం పనిచేసేలా పీకే సెట్ చేసాడు.అయితే… ఇప్పుడు ఎన్నికల సమయం ముంచుకు రావడంతో….పీకే జగన్ కు ఇచ్చిన మాట ప్రకారం రంగంలోకి దిగిపోయాడు.ప్రస్తుతం జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి.? ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనే వివరాలతో జగన్ కు రిపోర్ట్ అందజేయాలని చూస్తోంది.ఇక అభ్యర్ధుల విషయం చేయించిన సర్వే మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.
ఇప్పటి వరకు 85 అసెంబ్లీ స్థానాల్లోనే అభ్యర్ధుల విషయంలో స్పష్టత వచ్చిందని సమాచారం.
రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్న నేపధ్యంలో మిగతా 90 స్థానాల్లో అభ్యర్ధుల విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతుందని తెలుస్తోంది.దీంతో అభ్యర్ధులకు సంబంధించిన పీకే సర్వే రిపోర్ట్స్ ఫిబ్రవరి చివరి వారంలోపు అందజేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించాలని తెలుస్తోంది.ఎందుకంటే జగన్ బస్సుయాత్రకు ముందే ఎక్కువ మంది అభ్యర్ధలను ప్రకటించాలని చూస్తున్నారు.
ఇప్పటికే పీకే టీమ్ బృందం ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేసి పనిలో పడ్డాయి.ఏపీ మొత్తం పార్టీ పరిస్థితి ఎలా ఉంది … అనే విషయంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పీకే టీమ్ మెజార్టీ నియోజకవర్గాల్లో పార్టీకి మైలేజ్ రాకపోవడానికి ఆయా నియోజకవర్గ ఇంచార్జిలు గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని జగన్ కు రిపోర్ట్ ఇచ్చాడు.
అంతే కాకుండా ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు సమన్వయకర్తలు ఉండడం వారి మధ్య సఖ్యత లేకపోవడం ఇవన్నీ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్టు పీకే తన రిపోర్ట్ లో జగన్ కు అందించాడు.ఈ విషయంపై స్పంచిన జగన్ వారికి నచ్చచెప్పే పనిలో పడ్డాడట.ముందు మీరు పార్టీ గెలుపుకోసం కృషిచేయండి ప్రభుత్వం వచ్చాక మీకు తగిన న్యాయం చేస్తాను అంటూ… బుజ్జగిస్తున్నాడట.అయితే వారు మాత్రం తాము ప్రజల్లో బలంగా వెళ్లామని, ఇప్పడు టిక్కెట్ నిరాకరిస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు జగన్ ఎదుటే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఫిబ్రవరి నెలాఖరుకల్లా పీకే సర్వే రిపోర్ట్స్ వస్తాయని, దాని ప్రకారమే టిక్కెట్ ఇస్తానని జగన్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.