ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ లో ఆ రెండు సీన్లే హైలైట్ అంట.! అవేంటో చూడండి!

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

 Ntr Kathanayakudu Movie Highlight Scenes-TeluguStop.com

తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనుంది.

ఈ సినిమాలో హైలైట్ అంటే ఆ రెండు సన్నివేశాలే అంటూ సినీ అభిమానులు చెప్పుకుంటున్నారు.అందులో ఒకటి దివిసీమ ఉప్పెన సన్నివేశం కాగా మరొకటి ముగింపులో వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రకటన సన్నివేశమట.ఈ రెండు సీన్లు మంచి భావోద్వేగాలతో చక్కగా కుదిరాయని, సినిమాకే హైలెట్ అవుతాయని అంటున్నారు సినిమాను వీక్షించినవారు.

సినిమాలో బాలకృష్ణ అచ్చం ఎన్.టి.ఆర్ లా అభినయం అదరగొట్టాడు.కొద్దిసేపు మన చూసేది నిజంగా ఎన్.టి.ఆర్ అనేలా బాలయ్య కనిపిస్తారు.మొత్తం 60 పాత్రల దాకా బాలయ్య ఈ సినిమాలో చేశారు.

ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చూపించారు.బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నటించిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube