రైల్వే శాఖాలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.13,487 పోస్టుల భర్తీకి చేయనున్నట్లు ప్రకటించింది.ఇందులో జూనియర్ ఇంజినీర్లు, డిపో మెటీరియల్ సూపరిన్ టెండెంట్ , కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.ఈ ఉద్యోగాలకు స్కేలు రూ.35,400 నుంచి రూ.1,12,400 ఏడో కేంద్ర పే కమిషన్ ప్రకారం చెల్లిస్తారు.

ఈ పోస్టులకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంటు బోర్డు వెబ్ సైట్ లో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.ఈ ఉద్యోగాల కోసం జూనియర్ ఇంజినీర్ల కోసం గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి మూడేళ్ల డిప్లొమో పూర్తి చేయాల్సి ఉంది.వయస్సు పరిమితి 18 నుంచి 33 ఏళ్లు.