తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వెలువడి చాలా రోజులే అయినా … ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ సీరియస్ గా దృష్టిపెట్టలేదు.సీఎంగా కేసీఆర్, హోం మినిష్టర్ గా మహమ్ముద్ ఆలీ ప్రమాణ స్వీకారం చేశారు.

 Election Code Not An Obstacle For Telangana Cabinet Expansion-TeluguStop.com

మిగతా మంత్రి మండలిని ఏర్పాటు చేయడానికి అనుకూలమైన మంచిరోజులు లేవనే కారణంతో విస్తరణను కేసీఆర్ వాయిదా వేసుకుంటూ వచ్చారు.అయితే ఈ లోపున అనుకోకుండా… ఈలోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

జనవరి 30 వరకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంటుంది.దాంతో పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదని వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలే అంశం కాదని అంతా ఒక అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో తాజాగా .మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది.మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డుకాదని… కేబినెట్ ను విస్తరించుకోవచ్చని .దీనికి ఎటువంటి అడ్డంకులు లేవని ఈసీ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube