సోషల్ మీడియా ఈమద్య కాలంలో ఎంతగా ఉపయోగపడుతుందో అంతే చిరాకు కూడా తెప్పిస్తుంది.ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయి.
ఆ స్మార్ట్ ఫోన్‌ల్లో ఖచ్చితంగా వాట్సప్ ఉండాల్సిందే.వాట్సప్ అనేది స్నేహితులతో, సన్నిహితులతో ఛాటింగ్ చేసుకునేందుకు ఫొటోలు పంపుకునేందుకు మంచి మార్గం.
కాని ఈ వాట్సప్‌ను కొందరు తమ బ్రాండ్స్‌ను పబ్లిసిటీ చేసుకునేందుకు మరి కొందరు తమ కులాన్ని గురించి పబ్లిసిటీ చేసుకునేందుకు వాడుతున్నారు.

వాట్సప్‌లో ఈమద్య గ్రూప్‌లు ఎక్కువ అయ్యాయి.ప్రతి ఒక్కడు గ్రూప్ క్రియేట్ చేయడం అవతలి వారికి ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా యాడ్ చేయడం.ఇక యాడ్ చేసిన తర్వాత ఊరికే ఆ గ్రూప్ ఎందుకు ఉంటుంది.
రోజుకు వందల సంఖ్యలో మెసేజ్‌లు.వందల మంది ఉండే గ్రూప్‌లో వందల్లోనే మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి.
దాంతో ఆ గ్రూప్‌తో తలనొప్పితో ఎగ్జిట్ అవుదామా అంటే అందులో ఉన్న వారు ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటం.దాంతో ఎంతో మంది కూడా తమ వాట్సప్ గ్రూప్ మెసేజ్‌తో తల పట్టుకుంటున్నారు.
ఈ వాట్సప్‌ల వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సమాచార మరియు ఐటీ శాఖ వారు వాట్సప్‌కు సీరియస్‌గా కొన్ని కండీషన్స్ పెట్టడం జరిగింది.గ్రూప్‌ల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేలా చూడమన్నారు.
ఈ చిన్న చిట్కాలు వాడటం వల్ల వాట్సప్ గ్రూప్‌ల్లో కొనసాగుతూనే ఎలాంటి చికాకు లేకుండా ఉండొచ్చు.
ఏదైనా గ్రూప్‌లో మిమ్ముల యాడ్ చేసినట్లయితే, ఆ గ్రూప్‌లో కొనసాగాలని ఉన్నా, పదే పదే వచ్చే మెసేజ్‌లతో తల నొప్పి లేకుండా ఉండాలంటే ఆ గ్రూప్‌ను మ్యూట్ చేస్తే సరిపోతుంది.

ఇక మీరు ఏదైనా గ్రూప్‌ను క్రియేట్ చేస్తే కొన్ని కండీషన్స్‌తో దాన్ని చేయడం వల్ల కేవలం అడ్మిన్ మాత్రమే పోస్ట్‌లు చేయగలరు.గ్రూప్ సభ్యులు ఇతరులు ఎవరు కూడా దాంట్లో మెసేజ్‌లు చేయలేరు.
వాట్సప్‌లో ఇకపై కొత్తగా మిమ్ముళను ఎవరైనా యాడ్ చేసే ముందు మీ పర్మిషన్ అడిగేలా పీచర్‌ను తీసుకు వస్తుంది.దాన్ని ఎనేబుల్ చేసి పెట్టడం వల్ల వెంటనే మీరు ఏదైనా గ్రూప్‌లో యాడ్ కారు.
మీరు యాక్సెప్ట్ కొడితేనే ఆ గ్రూప్‌లో యాడ్ అవుతారు.
ఇలా వాట్సప్ వరుస మెసేజ్‌లతో చికాకు లేకుండా ఉండొచ్చు.







