ఈమద్య కాలంలో గల్లీ లీడర్‌లకు కూడా పెద్దగా సెక్యూరిటీ ఉంటుంది.గల్లీ లీడర్లకు ఆయన చుట్టు ఉండే కార్యకర్తలు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు.
అతడిపై ఈగ వాలకుండా చూసేందుకు పెద్ద టీం ఉంటుంది.అలాంటిది కేంద్ర మంత్రి అంటే ఏ స్థాయిల భద్రత ఉండాలి, కార్యకర్తల సందడి ఎలా ఉండాలి చెప్పండి.
కాని కేంద్ర మంత్రి రామ్‌ధాస్ అథవాలేని మాత్రం ఒక వ్యక్తి కొట్టే వరకు అలాగే చూస్తూ ఉండి పోయారు.కొట్టిన తర్వాత ఆ వ్యక్తిని మంత్రి కార్యకర్తలు చితక బాదారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేంద్ర మంత్రి రామ్‌ధాస్ అథవాలే తాజాగా మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.అక్కడ కార్యక్రమంలో పాల్గొని మెల్లగా తిరుగు ప్రయాణం అయ్యాడు.తన వెయికిల్ వద్దకు వెళ్తున్న మంత్రిని జనాల్లోంచి ఒక వ్యక్తి వచ్చి రెండు చెంపల మీద దెబ్బలు కొట్టి పారిపోబోయాడు.జనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వ్యక్తి పారిపోలేక పోయాడు.
దాంతో మంత్రి సెక్యూరిటీ గార్డ్‌లకు దొరికాడు.అతడిపై పెద్ద ఎత్తున దాడి చేశారు.
బాగా గాయాలపాలైన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే మళ్లీ మామూలుగా అవుతాడని, అప్పుడు జైలుకు పంపిస్తామని పోలీసులు అంటున్నారు.

మంత్రిని కొట్టడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో అతడు చెప్పిన సమాధానం చిత్రంగా అనిపించింది.ఇంతకు అతడు ఏం చెప్పాడట… మా ప్రాంతానికి ఈ మంత్రి ఒకసారి వచ్చాడు.అప్పుడు మాకు రోడ్డు మరియు ఇతర అవసరాలను తీర్చుతానన్నాడు.
అలా చేయక పోతే నా చెంప పగులకొట్టండి అన్నాడు.అందుకే ఇప్పుడు ఆ పనులు ఏమీ కాలేదు కనుక చెంప పగుల కొట్టాను అన్నాడు.
అప్పుడు మంత్రి అన్న మాటలు నా వద్ద రికార్గ్ ఉందని, ఆయనపై న్యాయపోరాటంకు తాను సిద్దం అంటూ ప్రకటించాడు.

రాజకీయ నాయకులు నోటికి ఏది వస్తే అదే హామీగా ఇస్తారు.ఆ హామీ నెరవేర్చకుంటే చెంప పగుల కొట్టాలి అంటే రాజకీయ నాయకులు చెంపకు ప్లాస్టర్స్ వేసుకోవాల్సిందే.






