ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి పారిపోయిన డాక్టర్‌.. పోతూ పోతూ ఏం చేశాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

ముస్లీం మహిళలు గత కొంత కాలంగా ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే.ముస్లీం ఆచారం ప్రకారం భార్యకు భర్త మూడు సార్లు తలాక్‌ అంటూ చెబితే వారిద్దరి మద్య ఎలాంటి సంబంధం ఉండదు.

 Bangalore Doctor Gives Triple Talaq To Wife Through Whatsapp Message-TeluguStop.com

ఇద్దరు అధికారికంగా విడిపోయినట్లే.ఆ ఆచారం వల్ల ఎంతో మంది ముస్లీం యువతులు ఇబ్బందులు పడుతున్నారు.అందుకే అలాంటి పద్దతిని ఇకపై వద్దంటే వద్దు అంటూ ముస్లీం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి తప్పకుండా ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయాల్సిందే అంటూ చట్టం కూడా తెచ్చేందుకు సిద్దం అయ్యింది.2.ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి పారిపోయిన డాక్టర్‌.పోతూ పోతూ ఏం చేశాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

ఇలాంటి సమయంలో ఇంకా కూడా ట్రిపుల్‌ తలాక్‌ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా బెంగళూరులో ఒక డాక్టర్‌ తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు.ఆయన వాట్సప్‌ ద్వారా తలాక్‌ చెప్పి పారిపోయాడు.

అమెరికాకు వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది.ఆయన వెళ్లే సమయంలో ఆమెకు సంబంధించిన వీసా మరియు పాస్‌ పోర్ట్‌లను కూడా తీసుకు వెళ్లాడు.

మళ్లీ ఆమె అమెరికాకు వచ్చే వీళు లేకుండా ఆయన ప్రయత్నం.బెంగళూరులో డాక్టర్‌గా తాను చేస్తున్న హాస్పిటల్‌లో రాజీనామా ఇచ్చిన ఈయన అమెరికాలో ఒక హాస్పిటల్‌లో డాక్టర్‌ గా జాయిన్‌ అయ్యాడట.

భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన తర్వాత మరో మహిళతో కూడా ఆయన సన్నిహిత్యం ఏర్పర్చుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.

2003వ సంవత్సరంలో డాక్టర్‌ జావేద్‌ ఖాన్‌ మరియు రేష్మా అజీజ్‌ు పెళ్లి చేసుకున్నారు.వీరికి 13 ఏళ్ల కూతురు కూడా ఉంది.కొంత కాలం పాటు అమెరికాలో ఉన్న వీరు ఈమద్య ఇండియాకు వచ్చారు.

బెంగళూరులో దిగిన ఇద్దరు ఎయిర్‌ పోర్ట్‌ నుండి బయటకు వచ్చారట.ఆ సమయంలో రేష్మా ను ఇంటికి వెళ్లమని జావేద్‌ మళ్లీ ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లాడు.

ఎంతకు కూడా జావేద్‌ తిరిగి రాకపోవడంతో ఫోన్‌ చేసింది.ఫోన్‌లు స్విచ్చాప్‌ ఉన్నాయి.

కొన్ని గంటలకు ఆమెకు అతడు మళ్లీ అమెరికాలో ల్యాండ్‌ అయినట్లుగా తెలిసింది.వెళ్తూ వెళ్తు ఆమె పాస్‌పోర్ట్‌ మరియు వీసా కూడా తీసుకు వెళ్లడంతో ఆమె ఇప్పుడు అమెరికా వెళ్లే పరిస్థితి లేదు.

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు కనుక ఇక ముస్లీం ఆచారం ప్రకారం ఇద్దరు విడాకులు తీసుకున్నట్లే అంటూ ముస్లీం పెద్దలు కూడా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube