ఈ ఇద్దరు చంద్రులు... రాజకీయ ముదుర్లు

తెలంగాణలో తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉంది.ఏ పార్టీకి ఆ పార్టీ నువ్వా నేనా.

 These Two Chandra Political Experts In Politics-TeluguStop.com

అనే స్థాయిలో పోటీ పడుతూ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.? టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి రకరకాల సర్వేలు చేస్తూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అనే భావనతోనే ఉంది.ఆ సందర్భంగానే ముందుస్తు ఎన్నికలు కూడా వెళ్ళిపోయింది.

దీనిపై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా… కేసీఆర్ గెలుపు ధీమాతో అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.అయితే ఆ తర్వాత పరిణామాలు మాత్రం టిఆర్ఎస్ పార్టీని చాలా కలవరానికి గురి చేశాయి.

ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని కేసీఆర్ భావించారు.

కానీ అనూహ్యంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోవడమే కాకుండా టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం చేసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా కూటమి ఏర్పాటు చేశారు.దీంట్లో ప్రధానంగా చంద్రబాబే నిర్ణయాలు తీసుకుని వాటిని తమ కూటమిలోని పార్టీలను ఒప్పించి ఆ నిర్ణయాలను అమలు చేస్తూ వస్తున్నారు.ఆఖరికి రాహుల్ సోనియా కూడా బాబు మీద భారం మోపి ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వస్తున్నారు.

ఈ పరిణామాలన్నీ కేసీఆర్ అసలు ఊహించలేదు.కానీ ఆ తర్వాత తేరుకుని కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను పక్కనబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఒక దశలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణాలో మీరు జోక్యం చేసుకుంటే ఏపీ రాజకీయాల్లో మేము జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది అంటూ… అసహనం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికల గంట నుంచి మోగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చంద్రాబునే కేసీఆర్ఆ అండ్ కో టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.అయినా గులాబీ పార్టీ లో గెలుపు ధీమా పూర్తిగా రాలేదు.రెండోసారి అధికారం దక్కుతుందనే ఆశ అంతకంతకు సన్నగిల్లుతూ వస్తోంది.

ఈ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఆంధ్ర వాడిని ఆంధ్ర తెలంగాణ అవసరమా అంటూ ఇంకా అనేక రకాల విమర్శలు చేస్తూ… తెలంగాణ ప్రజలను ఆలోచనలో పడేయాలని కేసీఆర్ భావించాడు.కానీ తెలంగాణలో వివిధ సర్వేలు గులాబీ పార్టీ కి అంత ఆశాజనకంగా లేదని తేల్చేశాయి.

ఇక కెసిఆర్ మాటలు తెలంగాణలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపిస్తాయి అనడానికి పెద్దగా అవకాశం కనిపించడం లేదు.ఎందుకంటే కోదండరాం వంటి కరుడుగట్టిన తెలంగాణ వాదులు సైతం బాబు బాబు పక్కనే చేరారు.

ఏమైనా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆరితేరిన తెలంగాణ చంద్రుడు ఆంధ్ర చంద్రుడు ఇద్దరు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కెలకముగా మారారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube