ప్రస్తుతం బయోఫిక్ ల హవా నడుస్తోంది.మహా మహుల జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు చాలామంది దర్శకులు, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
తెలుగు సినీ ఇండ్రస్ట్రీని పరిగణలోకి తీసుకుంటే… ఇప్పటికే ‘మహానటి’ పేరుతో సావిత్రి జీవిత గాధను తెరకెక్కించారు.ఈ బయోఫిక్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
ఇక ఇప్పుడు చిత్రీకరణలో ఎన్టీఆర్ బయోఫిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ , వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇప్పుడు తమిళ నాట స్వర్గీయ జయలలిత బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో జయలలిత క్యారెక్టర్ ఏ హీరోయిన్ చేస్తుంది, ఎవరు ఆమె పాత్రకి సూట్ అవుతారు అంటూ గత కొద్ది రోజులుగా రకరకాల చర్చలు జరిగాయి.చివరకు జయలలిత పాత్ర పోషించబోయే నటి ఎవరో ఫిక్స్‌అయిపోయింది.సౌత్‌లో చక్రం తిప్పుతున్న నయనతార జయలలిత బయోపిక్‌లో జయలలిత క్యారెక్టర్ చెయ్యబోతోందని తెలుస్తుంది.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న జయలలిత బయోపిక్ కోసం నిర్మాతలు నయనతారని సంప్రదించగా, ఆమె ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.