ఓ అపార్ట్ మెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది.ఆ ఫ్లాట్ లో ఉండేది.
తల్లి, తండ్రి.ఓ అమ్మాయి.
రాత్రి 12 గంటల సమయంలో అమ్మాయి బెడ్ రూమ్ లోని కిటికీ దగ్గర చప్పుడైంది… ఏంటో చూద్దామని లేచి చూసే లోపు….ఇద్దరు యువకులు వాళ్లు రాసిన చిట్టీని అక్కడ పడేశారు….
భయటికి రా.అంటూ సైగ చేశారు.మొదట వారు రాసిన చిట్టీలో వాళ్ల ఫోన్ నెంబర్లు రాశారేమో అనుకుందా అమ్మాయి….కానీ చిట్టీ తీసి చదివి షాక్ కు గురయ్యింది…… అందులో ఇలా రాసుంది.
” నీ నగ్న వీడియో నాదగ్గరుంది, వెంటనే ఓ సారి బయటికి వచ్చి నన్ను కలువు….నీవు వైట్ కలర్ ప్యాంటీ, బ్లాక్ కలర్ బ్రా వేసుకున్నావు” అని రాసి ఉంది.
ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఒళ్లంతా జలదరించింది, చెమటలు పడుతున్నాయ్.కాళ్లు చేతులు వణికిపోతున్నాయ్….ఓ గ్లాస్ నీళ్లు తాగి కాస్తంత కుదుట పడింది…ఎలాగైనా వాడి పని పట్టాలని…కోపంగా నాన్నను తీసుకొని బయటికి వెళ్లింది …అంతవరకే వాళ్లు అక్కడి నుండి పరారయ్యారు.ఈ అలికిడికి వారి అపార్ట్మెంట్ వాసులంతా మేల్కొన్నారు.
విషయం తెలుసుకున్న అపార్ట్ మెంట్ వాసులు …ఆ….ఈ అమ్మాయికి ఇష్టం లేకుండానే వాళ్లు వీడియో తీసారా? అయినా కిటికీ ఎందుకు తెరిచి ఉంచుకోవడం? వచ్చిన ఇద్దరిలో ఎవరితోనే సంబంధం లేకపోతే…కిటీకి దాకా వస్తారా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు.ఇవేవీ పట్టించుకోకుండా.ఆ యువతి మాత్రం ఆ దరిద్రపు పని చేసిన వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులను ఆశ్రయించింది.
ఇప్పుడు అపార్ట్మెంట్ వాసుల దగ్గరికొద్దాం…ఓ అమ్మాయి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే అండగా ఉండాల్సింది పోయి…ఆమె క్యారెక్టరే కరెక్ట్ గా కాదన్నట్టుమాట్లాడడం ఎంత వరకు సబబు? ఓ అపార్ట్ మెంట్ లోని ఫస్ట్ ప్లోర్ వరకు వెళ్లి.ఆకతాయిలు ఇలా చేశారంటే…వాళ్లకు ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది…హా…ఎవ్వరూ ఏమీ చేయలేరులే అనే ధీమానేనా? బయటికి వచ్చిన ఉదంతం ఇదొక్కటే….బయటికి రానీ ఇలాంటి ఇన్సిడెంట్ లు మరెన్నో…….? మనకు మనమే అండగా ఉండాలి.కామాంధుల పని పట్టాలి.ఇప్పుడు అక్కడ జరిగింది.రేపు మన చెల్లికే జరగొచ్చు, మన అక్కకు అవ్వొచ్చు…
.