ఒకప్పుడు వ్యవసాయంకు చాలా ప్రాముఖ్యత ఉండేది, కాల క్రమేనా వ్యవసాయం ప్రాముఖ్యత తగ్గడం యువత ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల వెంట పడటం చేశారు.కాని కాలం చక్రం అన్నట్లుగా మళ్లీ యువతకు వ్యవసాయంపై ఆసక్తి కలుగుతోంది.
ఎంతో మంది యువకులు చేస్తున్న ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తున్నట్లుగా మనం వార్తల్లో చూస్తున్నాం.ఇంజనీర్‌లు ఇంకా పలు రంగాలకు చెందిన వారు కూడా తమ జాబ్‌ను వదిలేసి వ్యవసాయంలోకి దిగి ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు.
హర్యానాకు చెందిన రాకేష్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా కోట్లను వ్యవసాయంతో సంపాదిస్తున్నాడు.
హర్యానాకు చెందిన రాకేష్ సింగ్ కుటుంబంకు వ్యవసాయం భారీగానే ఉంది.కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసినా కూడా రాకేష్‌కు మాత్రం వ్యవసాయంపై ఆసక్తి లేదు.వ్యవసాయం చేయడం ఇష్టం లేని రాకేష్ డిప్లొమా చేసి ఇంజనీర్‌గా సెటిల్ అయ్యాడు.
నెలకు 40 వేల జీతం పొందుతూ హ్యాపీగానే జీవితం గడిపాడు.కాని అతడికి జాబ్ బోర్ కొట్టింది.
ఇంకా ఏదో చేయాలని అతడిలో ఆశ కలిగింది.అందుకే తనకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
మొదట కొద్ది మొత్తం భూమిలో మాత్రమే వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు.అందులో కూరగాలను పెంచాడు.శాస్త్రీయంగా మందులు కొట్టకుండా రాకేష్ కూరగాయాలు పండించాడు.అతడి కూరగాయలకు మంచి రేటు వచ్చింది.
అలా మెల్ల మెల్లగా ప్రారంభం అయిన అతడి జర్నీ సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వస్తోంది.హర్యానాలోని ఒక చిన్న గ్రామంకు చెందిన గ్రామంలోనే ఉంటూ లక్షలు సంపాదిస్తూ తన తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వ్యవసాయం అంటే ఆసక్తి లేని వారు వ్యవసాయం చేస్తే నష్టాలు చూడాల్సి ఉంటుందని భావించిన వారు ఇప్పుడు రాకేష్ సింగ్‌ను చూసి కొత్త తరహా వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
కూరగాయలు, పండ్ల తోటల ద్వారా 2017లో 40 లక్షల ఆధాయంను దక్కించుకున్న రాకేష్ 2018వ సంవత్సరంలో 50 లక్షలకు పైగా ఆదాయంను రాబట్టాడు.ఇక ఈ ఏడాది మొత్తంగా కోటి వరకు ఆదాయం వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.ఈ ఏడాది ప్రతి పంట కూడా అనుకూలంగా ఉందని, ప్రతి విషయంలో పాజిటివ్‌గా ఉందని రాకేష్ అంటున్నాడు.
ఈ ఏడాది కోటి రూపాయల పంట తీయడంతో తాను రికార్డు సాధించాలని ఆశ పడుతున్నాడు.
దేశంలో ఎంతో మంది యువత వ్యవసాయం చేస్తున్నారు.
అయితే లక్షల ఆదాయం వచ్చినట్లుగా విన్నాం కాని ఏకంగా కోటి ఆదాయం సాధించిన రైతును మనం చూడలేదు.అందుకే ఈ రైతు దేశంలోనే ఖరీదైన రైతుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ముందు ముందు తన ఆదాయంను మరింత పెంచుకోవడంతో పాటు ఎక్కువ మందికి ఉపాది కల్పించేందుకు ప్రయత్నిస్తాను అంటున్నాడు.ఉద్యోగం లేదని బాధ పడటంకంటే ఉన్నదాంతోనే అద్బుతాలు ఆవిష్కరించ వచ్చు అని రాకేష్ ని చూసి అంతా ఆదర్శంగా తీసుకోవాలి.