తన పాదయాత్ర ఒకవైపు .ప్రభుత్వ వ్యతిరేకత మరో వైపు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ధీమాగా ఉన్నాడు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నా.అభ్యర్థుల ఎంపికలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టం ఏమీ కాదని జగన్ అభిప్రాయపడుతున్నాడు.
అందుకే టికెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.పార్టీ పట్ల విధేయత నమ్మకం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు తనకు అవసరం లేదని జగన్ పార్టీ ముఖ్య నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నాడు.

ఇప్పటికే .అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే వడపోత పోసిన ప్రశాంత్ కిషోర్ టీం కూడా యువ నాయకుల పేర్లనే ఎక్కువగా చెబుతుండటంతో జగన్ ఆలోచనకు కూడా ఇది కలసి వచ్చినట్లు చెబుతున్నారు.ఇప్పటికే అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి రావడంతో కొన్ని చోట్ల రీ సర్వే చేయించాలని జగన్ ఆదేశించనట్లు తెలుస్తోంది.గత ఎన్నికల్లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు యువకులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది జగన్ తీసుకున్న తాజా కీలక నిర్నయం.
ఇప్పటికే నంద్యాల నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణి కుమారుడు శిల్పా రవికి జగన్ టిక్ పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది.అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల విజయేంద్రదరెడ్డిని అలియాస్ నాని విషయంలో సర్వేలో కొంత తేడా కన్పించడంతో మళ్లీ సర్వే చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
నంద్యాలలో మాత్రం శిల్పా రవికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో సీనియర్ నాయకులను తాను ఎంతగానో నమ్మానని.కానీ వారు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా పార్టీ ఫిరాయించి తిరిగి పార్టీ మీదే బురద జల్లారని జగన్ ఇప్పటికీ ఆవేదన చెందుతున్నాడట.ఈ విధంగా… ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, సుజయ కృష్ణరంగారావు, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జలీల్ ఖాన్, డేవిడ్ రాజు, పోతుల రామారావు వంటి వారు పార్టీని విడిచి వెళ్లారు.
అంతేకాకుండా మైసూరారెడ్డి, సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, ఎంపీ ఎస్పీవై రెడ్డిలు తన మైండ్ సెట్ కు సరిపడలేదన్న భావనలో ఆయన ఉన్నారంటున్నారు.యువకులైతే ఎటువంటి ప్రలోభాలకు లొంగరన్నది జగన్ భావనగా తెలుస్తోంది.







