బాలయ్య మోజు ఖరీదు రెండు కోట్లు.. మరీ ఇంత అవసరమా

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రకు విద్యాబాలన్‌ ఎంపిక అయిన విషయం తెల్సిందే.

 Vidya Balan To Make Her Telugu Debut With Ntr Biopic-TeluguStop.com

ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో బాలయ్యతో పాటు విద్యాబాలన్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటుంది.బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఒప్పుడు ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ విద్యాబాలన్‌ ప్రస్తుతం జోరు కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు.

అయితే ఈమెను తెలుగుకు తీసుకు రావాలని బాలకృష్ణ చాలా కోరుకున్నాడు.

బాలయ్య తన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో శ్రియ స్థానంలో విద్యాబాలన్‌ను ఎంపిక చేయాలని భావించాడు.

అందుకోసం సంప్రదింపులు కూడా జరిపారు.భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో దర్శకుడు క్రిష్‌ ఆమెను పక్కకు పెట్టాడు.

విద్యాబాలన్‌ డిమాండ్‌ చేసిన మొత్తంలో కేవలం 25 శాతం శ్రియకు ఇవ్వడంతో ఆమె నటించింది.అయితే బాలయ్యకు మాత్రం విద్యాబాలన్‌తో సినిమా చేయాలనే కోరిక అలాగే ఉండి పోయింది.

అందుకే ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో విద్యాబాలన్‌ను పట్టుబట్టి మరీ ఎంపిక చేయించాడు.ఈ చిత్రానికి బాలకృష్ణ నిర్మాత అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పారితోషికం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా విద్యాబాలన్‌ను ఎంపిక చేయడం జరిగింది.

‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం విద్యాబాలన్‌ 30 రోజు కాల్షీట్లను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అందులో 20 రోజులు మాత్రమే షూటింగ్‌కు, మిగిలిన పది రోజులు ప్రమోషన్స్‌ కోసం విద్యా బాలన్‌ డేట్స్‌ను వాడుకోబోతున్నారు.అంటే కేవలం 20 రోజులు షూటింగ్‌లో విద్యాబాలన్‌ పాల్గొనబోతుంది.ఈ 20 రోజుల డేట్లకు విద్యాబాలన్‌ ఏకంగా 2 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.అతి తక్కువ డేట్లు ఇచ్చి, అతి ఎక్కువ పారితోషికం తీసుకోబోతున్న విద్యాబాలన్‌ సినిమాలో కనిపించేది కూడా కొద్ది సమయమే.అయినా కూడా బాలకృష్ణకు చాలా కాలంగా విద్యాబాలన్‌తో నటించాలనే కోరిక ఉంది.

అందుకే ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి కూడా ఈ చిత్రంలో నటింపజేస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.

బాలయ్య మోజుకు రెండు కోట్లు వృధా అవుతున్నాయని, ఆ పాత్రను సౌత్‌లో ఏ స్టార్‌ హీరోయిన్‌తో చేయించినా కూడా కేవలం 40 నుండి 50 లక్షల పారితోషికంతో పూర్తి అయ్యేది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

అయితే విద్యాబాలన్‌ ఉండటం వల్ల బాలీవుడ్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతుందని కూడా కొందరు అంటున్నారు.మొత్తానికి బాలకృష్ణ గత రెండు సంవత్సరాలుగా అనుకుంటున్న విద్యాబాలన్‌తో నటించాలనే కోరిక తీరబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube