నూతన దంపతుల ఆత్మహత్య.! కారణం స్మార్ట్ ఫోన్ లో పడకగది సీన్ల రికార్డ్ సెల్ఫీ.!

ఓ స్మార్ట్ ఫోన్ రెండు నిండు జీవితాలను బుగ్గిపాలు చేసింది.ఇది టెక్నాలజీ వీర విహారమా?లేక వాడే వారి విచ్చలవిడితనమో కానీ నూతన దంపతులు మాత్రం దానికి బలైపోయారు.ఫోటో లు , సెల్పీ ల నుండి పడకగది సీన్లను కూడా రికార్డ్ చేసుకునే దాకా వచ్చింది స్మార్ట్ ఫోన్ల ఉపయోగం.దీని కారణంగానే నూతన జంట ఆత్మహత్య చేసుకున్నారు…

 Newly Married Couple Suicide Due To Selfie Photos-TeluguStop.com

వివరాల్లోకెళితే కొత్తగా పెళ్ళైన జంట, చిలకాగోరింకల్లా అన్యోన్యంగా గడిపేవారు.

ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఆ దంపతులిద్దరూ తాము ‘సన్నిహితంగా’ ఉన్న శృంగార దృశ్యాలను వారి స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించుకున్నారు.కానీ నెలరోజుల క్రితం వారు చేసిన ఒక ప్రయాణంలో ఆ ఫోన్‌ పోయింది.

దీంతో ఆ ఫోన్ దొరికిన వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేసి చూశాడు.వీడియో పోల్డర్ ఓపెన్ చేసి చూడాగానే ఒక్కసారిగా అవాక్కయ్యాడు, భార్యాభర్తలు సన్నిహితంగా ఉంటూ రికార్డ్ చేసుకున్న వీడియో కనిపించింది, వెంటనే వాట్స్ యాప్ లో తన ప్రెండ్స్ కు ఆ వీడియో సెండ్ చేశాడు, అక్కడి నుండి ఆ వీడియో పదులు, వందలు,వేలు ,లక్షల మంది చేతులు మారింది.అది కాస్త పోర్న్ సైట్స్ లో కూడా పోస్ట్ అయిపోయింది.

ఇది తెలుసుకున్న ఆ దంపతులు సిగ్గుతో చితికిపోయారు.

అయినవారికి, బంధువులకు ముఖం చూపలేక విషం మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో జరిగింది.

రంగంలోకి దిగిన పోలీసులు దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు.

పడక గది ముచ్చట్లు, మురిపాలు అక్కడి వరకే పరిమితం చేస్తే ఆ కపుల్స్ జీవితం ఇలా అర్థాంతరంగతా ముగిసేది కాదు.

బీ కేర్ ఫుల్, స్మార్ట్ ఫోన్లను మరీ ఎక్కువగా పర్సనల్ లైఫ్ లోకి రానివ్వకుండా చూసుకోండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube