“జనసేన పార్టీ” కొత్తగా పుట్టకపోయినా సరే 2019 ఎన్నికల్లో మాత్రం మొదటి సారిగా ప్రత్యక్ష రాజకీయాల బరిలోకి దూకుతోంది.అయితే పవన్ ఒక్క మాట చెప్తే చాలు పార్టీ కార్యక్రమాలని హుటాహుటిన ప్రారంభించి.
పార్టీ ని ముందుకు తీసుకువెళ్ల గలిగే ఎంతో మంది యువ రక్తం పవన్ కి వెన్ను దన్నుగా ఉంది.తన సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గ అభిమానులు కానీ ఎవరు ఉన్నా సరే పవన్ కి బాసటగా నిలిచేది అధిక శాతం యువకులే.
అయితే పవన్ కూడా వారికి తగ్గట్టుగానే మొదట్లో భీకర అరుపులు.ప్రసంగాలు చేసుకుంటూ జనసేనని బాగానే ప్రజలలోకి తీసుకుని వెళ్ళాడు…అభిమానుల్లో వెయ్యి ఒల్ట్లు కరెంటు నింపాడు కానీ.

ఈ మధ్య కాలంలో చూసుకుంటే.పవన్ నిర్ణయాలు గాని…పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధానం గానీ ఎంతో నెమ్మదిగా ఉంటున్నాయి.వృద్దులు అందరు కలిపి ఒక పార్టీ పెట్టుకున్నారా అనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.తమకి సత్తా, పోరాట పటిమ పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకోవడానికి తహ తహ లాడాల్సిన పార్టీ…ఈసురోమంటూ.
ఉంటోంది.ఈ పరిస్థితులని చూసి పార్టీ కార్యకర్తలు.
వీరాభిమానులు సైతం ఆశ్చర్య పోతున్నారు.
ఎదో రాజకీయ పార్టీ పెట్టాం దానిని నడిపించాలి అనేట్టుగా ఉంటోందట పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు.
అయితే తాజగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో జనసేన అభిమానులు , కార్యకర్తలు తెగ బెంగ పడిపోతున్నారు.ఇదెక్కడి నిర్ణయం అంటూ తలలు పట్టుకుంటున్నారు.
విజయవాడలో వామపక్షాలతో తన సొంత పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన పవన్ కళ్యాణ్ ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చారు.“మార్నింగ్ వాక్” ఉద్యమం అంటూ ప్రకటన చేశారు.
ఇదేంటి ని శ్రద్దగా ఉన్న అభిమానులకి కళ్ళు బైర్లు కమ్మాయి.‘మార్నింగ్ వాక్ ఉద్యమం’ 6వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుంది.
జాతీయ రహదార్ల మీద.ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం కలుగకుండా “జనసేన మరియు వామపక్షాల” నాయకులు ‘మార్నింగ్ వాక్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇదీ అసలు విషయం…అయితే ఈ వాక్ తో ప్రత్యేక హోదా వచ్చేస్తుందా.?ఢిల్లీ కోటలు కంపిస్తాయా అంటే అదీలేదు .అసలు ఎందుకు చేయాలి.?.దీని వలన ఒరిగేది ఏంటి.?
వామపక్షాలతో కలిసి పవన్ కూడా వారిలాగానే రాస్తారోకోలు.వాకింగ్ లు అంటూ ఉద్యమాన్ని నడిపించాలి అనుకుంటే మాత్రం ఒక అడుగు ముందుకు వేస్తె వంద అడుగులు వెనక్కి వెళ్ళడం ఖాయం అంటున్నారు.హీరోలాంటి తమ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఇలాంటి ఐడియా లు అసలు ఎలా వస్తున్నాయి అంటూ ఫైర్ అవుతున్నారు.
కనీసం తమ హీరో ఆమరణ నిరాహార దీక్ష.లేదంటే రెండు రోజులు దీక్ష అయినా చేస్తాడేమో అనుకుంటే అదీ లేదు.ఈ వాక్ వలన ఇప్పటి వరకూ జనసేన సంపాదించిన క్రేజ్ మొత్తం పోయినట్టే అంటూ తెగ భాదపడుతున్నారు.పవన్ పై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇలానే పార్టీని నడిపితే చివరికి కాళ్ళ నెప్పులు, అరిగిపోయిన చెప్పులు తప్ప ఏమి ఉండదని.ఇదేమి యాత్రలు పవనూ అంటూ తెగ మండి పడుతున్నారు అభిమానులు కార్యకర్తలు.







