గుజరాత్ ఎన్నికల తరువాత ఏపీ సీఎం పై విమర్శలు మొదలు పెట్టిన ఏపీ బీజేపి నాయకులు.మెల్ల మెల్లగా స్వరం పెంచుతూ వెళ్తున్నారు.
సోము వీర్రాజు చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టిడిపి నాయకులకి బీపీ తెప్పిస్తుంటే ఉన్నాయి.టిడిపి లేకుండా పోటీ చేయగల సత్తా మాకు ఉంది.
మీ వల్ల మాకు ఒరిగింది మాత్రం సూన్యం అంటూ సోము విరుచుకు పడ్డాడు.కొన్ని రోజుల తరువాత బీజేపి మరో ఎమ్మెల్సీ ఇదే స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఆ తరువాత సీనియర్ నాయకురాలు బీజేపి నేత పురంధరేశ్వరి కూడా ఫైర్ అవుతూ మేము విడిగానే పోటీ చేస్తాము అన్ని నియోజకవర్గాలలో బీజేపి వాళ్ళు నిలబడతారు అంటూ బాబు పై ఫైర్ అయ్యారు.అయితే ఇప్పుడు ఈ వంతు తాజాగా ఏపీ బీజేపి దేవాదాయ శాఖామంత్రి పైడి కొండల మాణిక్యాలరావు కి వచ్చింది.
బుధవారం తన నియోజకవర్గం తాడేపల్లి గూడెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు….ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై సాక్ష్యాత్తు ఆయన మంత్రివర్గ సభ్యుడే తీవ్రంగా ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.ఒక మంత్రిని అయిన తనకి అదీ తన నియోజకవర్గంలో అంటరానివాడిగా చేస్తున్నారు తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్ధాపన కార్యక్రమాలకు తననే దూరంగా ఉంచడానికి కారణం ఏమిటో చెప్పాలి అని ఫైర్ అయ్యారు.
గడిచిన మూడున్నరేళ్ళుగా తాను ఓపిక పడుతున్నా.అయినా సరే ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు మీరు ఎదో అనుకుంటున్నారు నన్ను నిలదీయాలని చుస్తే తానే ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు.
తాను ప్రశ్నించటం మొదలుపెడితే చాలామందికి బాధ కలుగుతుందన్నారు.“ నన్ను కట్ చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ నే కట్ చేస్తా” అంటూ చేసిన హెచ్చరికలు చేశారు.