ప్రత్యర్థి పార్టీలను బెంబేలెత్తించాలనే ఉద్దేశంతో తన కుట్ర కోణాన్ని మెల్లి మెల్లిగా బయటకు తీస్తోంది వైసీపీ .అర్ధం పర్థం లేని రూమర్స్ తో అధికార పార్టీ ఇమేజ్ కొంచెమైనా డామేజ్ చెయ్యాలని చూస్తోంది.
అందుకే ఇప్పుడు సరికొత్త అసత్య కథనాలను ప్రచారంలో పెట్టి ఆనందం పొందుతోంది.దీనిలో ఎన్టీఆర్ తో తన రాజకీయ అవసరాల కోసం వైసీపీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది.
సీఎం చంద్రబాబు, బాబాయ్ బాలయ్యతో ఎన్టీఆర్ కి వున్న దూరాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని ఎలాగైనా ముగ్గులోకి లాగాలని వైసీపీ గతంలోనూ ఎన్నో ప్రయత్నాలు చేసింది.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మీద కూడా కన్నేసింది
అయితే 2009 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాల్ని దగ్గరగా చూసిన ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల జోలికి వెళ్లకుండా హాయిగా సినిమాలు చేసుకుందామని డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు సాక్షి లో అసత్య కథనాలు ప్రచారం చేస్తూ ఎన్టీఆర్ అభిమానుల్లో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.అందులో భాగంగానే ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు త్వరలో వైసీపీ లో చేరబోతున్నాడని ఆ పుకార్ల ప్రచారం చెయ్యడ్డం మొదలుపెట్టింది.
చంద్రబాబు మేనకోడల్ని వివాహం చేసుకున్న నార్నె శ్రీనివాసరావు మీద కిందటి ఎన్నికల ముందు కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి.కానీ అలా జరగలేదు.
నిజానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ లోకి వెళ్లడమే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.పిల్లనిచ్చిన మామ అలా చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఎన్టీఆర్ కి తెలుసు.
అందుకే ఆయన సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు
వైసీపీ మాత్రం రాజకీయంగా టీడీపీని దెబ్బ కొట్టాలంటే చిన్న ఎన్టీఆర్ మీద బాణం ఎక్కుపెట్టాల్సిందే అంటూ తన శాడిజాన్ని చూపిస్తోంది.అయినా తన కట్టే కాలే వరకు టీడీపీలోనే ఉంటాను అన్న జూనియర్ మాటలు ఎవ్వరు మర్చిపోరు ! అసలు ఈ విషయాన్నీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా చెప్పాడంటే పార్టీపై అతనికి ఎంత ప్రేమ ఉందో మనకు అర్ధం అవుతోంది కదా
.