అల్లం, దాల్చిన చెక్క తో ఉపయోగాలు

అల్లం, దాల్చిన చెక్క ఈ రెండు పేర్లు వినగానే గుర్తుకువచ్చేది బిరియాని,ఏదన్నా మసాలా పదార్ధం.

ఎక్కువ మంది వీటిని ఉపయోగించరు ఎందుకంటే చలా మంది వీటిని మసాలా వస్తువులుగానే భావిస్తారు.

కానీ వీటితో మనిషికి సంభవించే వ్యాధుల నిర్మూలన చేయవచ్చు అని చాలా మందికి తెలియదు.వీటివల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

కాలిఫోర్నియాలోని వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి పరిశోధనలో తేలిన ఒక అదుతమైన విషయం ఏమిటంటే దాల్చిన చెక్క టైప్ -2 మధుమేహం రోగుల్లోని రక్తంలో చెక్కెర నియంత్రణకి సాయపడుతుంది అని.దాల్చిన చెక్క ఆకు ముద్దని ఒక స్పూను తీసుకుని దానిలో రెండు స్పూన్ల తేనే కలిపి సేవిస్తే దగ్గు క్షణాలలో పోతుంది.దాల్చిన లో శక్తివంతమైన పోషకాలు ఉన్నాయి.

అవి మెదడు పని తీరుని చురుగ్గా చేస్తాయి.శరీరంలో ఉండే చెడు కొలిస్త్రాలుని తగ్గించడం లో దాల్చిన ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

అల్లం తీసుకోవడం వల్ల పైత్యం తగ్గుతుంది.మనిషి శరీరంలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది.

వాంతులు తగ్గటానికి కూడా అల్లం పనిచేస్తుంది.అలర్జీల వంటివి తగ్గుతాయి.

హృదయానికి రక్త ప్రసరణ సక్రమంగా అందుతుంది.నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధ పడుతున్న వారు కప్పు అల్లం చారులో చెంచా తేనె వేసి తాగితే ఫలితం ఉంటుంది.

అల్లం ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ,నిమ్మరసం,ఉప్పు కలిపి ఒక నెల రోజులు నిల్వ చేసి తరువాత దానిని ఎండలో పెట్టి ఒక్కొక్క ముక్క తీసుకుంటే దాని ప్రభావం నోటిలో ఉండే అల్సర్స్ మరియు , చిగుల్ల మధ్య దాగి ఉండే క్రిములని నిర్మూలిస్తుంది.భోజనం ముందు కానీ లేదా తరువాత కానీ అల్లం తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా
Advertisement

తాజా వార్తలు