దక్షిణ అమెరికాలో పుట్టి, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది అనాసపండు (పైనాపిల్).దీన్ని ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లోకి వాడుతారు, ఐస్ క్రీమ్ లో వాడతారు, ఫేషియల్ లోకి వాడుతారు.
ఇక జ్యూస్ సెంటర్లో పైనాపిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే.ఎందుకంటారు .పైనాపిల్ కి ఇంత క్రేజు!
* 8 ఔన్సుల కప్ లో పైనాపిల్ జ్యూస్ తాగారంటే, 33 మిల్లిగ్రాముల కాల్షియం, 30 మిల్లిగ్రాముల మెగ్నీషియం, 130 కాలరీలు, 25 మిల్లిగ్రాముల విటమిన్ సి, 0.78 గ్రాముల ఐరన్ దొరుకుతుంది.
*పైనాపిల్ కో బ్రోమ్ లైన్ ని యాంటి క్యాన్సర్ ఏజెంట్ గా చెబుతారు.పలు పరిశోధనలు తరువాత, పైనాపిల్ క్యాన్సర్ సెల్స్ ఎదుగుదలను కంట్రోల్ లో ఉంచగలదని తెలిసింది.
* ఇందులో విటమిన్ సి మొతాదు ఎక్కువే అని చెప్పాంగా.చైనా, ఫిన్ లాండ్ లో జరిగిన సర్వే ప్రకారం, విటమిన్ సి కొరొనరి హార్ట్ డిసీజ్ కి చెక్ పెట్టగలదు.
* విటమిన్ సి కనుల ఆరోగ్యానికి మంచిదని కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.అలాగే ఇందులో దొరికే బెటాకరోటిన్ ఆస్థమా ని కంట్రోల్ చేయగలదు.
* పైనాపిల్ వివిధ న్యూట్రింట్స్ ని కలిగి, స్త్రీ, పురుషులిద్దరిలో ఫెర్టిలిటి (బిడ్డను కనే శక్తి) పెంచుతుందని పలు పరిశోధనలు తెలిపాయి.
* గాయాలు తగిలితే పైనాపిల్ మంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఎందుకంటే ఇందులో లభించే బ్రొమ్ లైన్ యాంటి ఇంఫ్లెంటరి లక్షణాలను కలిగి ఉంటుంది.
* పైనాపిల్ లో కాల్షియం దండిగా ఉండటంతో ఇది ఎముకల ఆరోగ్యానికి ఉపయోగకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
* డైటరి ఫైబర్ కంటెంట్ కూడా బాగానే దొరకడం వలన పైనాపిల్ జీర్ణశక్తిని పెంచుతుంది.