సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా సున్నితమైన మనిషి అని, కావాల్సిన వారు ఏదైనా అడిగితే వెంటనే కరిగిపోయి ఇచ్చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ ఉంటాయి.శ్రీకాంత్ అడ్డాలకి బ్రహ్మోత్సవం అవకాశం కూడా ఓ అత్యవసర సమయంలో అడ్డాలని ఆదుకోవడానికే మహేష్ ఇచ్చాడని ఓ టాక్ కూడా ఉంది.
పాత విషయాలు పక్కనపెడితే, ఇప్పుడు నాగార్జునకి పెద్ద సహాయమే చేస్తున్నాడట మన సూపర్ స్టార్.
అఖిల్ – హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన జరిగిన విషయం తెలిసిందే.
అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయేలా ఉంది.ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం హను, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కి మరో చిత్రం చేయాలట.
మరి అఖిల్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరు?
వంశీ పైడిపల్లికి ఇపుడప్పుడే మహేష్ ఛాన్స్ ఇవ్వడు అని అన్నారు .మరి ఒక్కసారిగా మహేష్, 24వ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు అనే ప్రకటన ఎలా వచ్చింది? ఇదంతా నాగార్జున గారి పనే అని ఫిలింనగర్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
అఖిల్ పెద్ద హీరోగా ఎదగాలంటే మాస్ డైరెక్టర్లతో చేయాలి.అందుకోసమే మహేష్ ని కాకాపట్టి, మహేష్ – కొరటాల కాంబినేషన్ ని కొంతకాలం వాయిదా వేయించి, ఇప్పుడు అఖిల్ – కొరటాల శివ కాంబినేషన్ సెట్ చేయిస్తున్నారట నాగార్జున.
అందుకే మహేష్ 24వ సినిమాకి కొరటాల బదులుగా వంశీ పైడిపల్లి వచ్చి చేరాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరో రూమర్ ఏంటంటే, బిజినెస్ హైప్ మరింత పెరగడానికి, కుదిరితే మహేష్ బాబు నిర్మాణంలో అఖిల్ – కొరటాల శివ సినిమా రూపొందించాలని మన కింగ్ ప్లాన్ వేసారట.
మొత్తానికి మహేష్ బాబుని బాగా వాడుకుందామని ఫిక్స్ అయిపోయారన్న మాట.







